ICC T20 World Cup : పేకమేడలా కూలుతున్న శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్

Update: 2020-02-29 05:11 GMT
India Vs Srilanka

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ మరో పోరుకు సిద్ధమైంది. మెల్‌బోర్న్‌ వేదికగా లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ భారత్ శ్రీలంకతో ఆడనుంది. బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకకు ఆ జట్టు ఓపెనర్లు టీమిండియా బౌలర్లు షాక్ ఇచ్చారు. ఓపెనర్ ఉమేశ (2) దీప్తి శర్మ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రాజేశ్వరి చేతికి దొరికింది. కెప్టెన్ ఆటపట్టు(33), హర్షిత (12) ఇరద్దు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రాజేశ్వరి బౌలింగ్‌లో హర్షిత క్లీన్‌బౌల్డ్‌ అయింది దీంతో శ్రీలంక 42 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తొమ్మిదో ఓవర్ అందుకున్న రాధా యాదవ్‌ నాలుగోబంతికి ఆటపట్టుని పెవిలియ్‌కు చేర్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ఉమెన్ హాసిని(7), కరుణరత్నె (7), అనుష్క(1) పెవిలియన్ చేరారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక ఏడు వికెట్లు నష్టానికి 82 పరుగులు చేసింది.

తొలుత టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో మ్యాచ్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలని భారత్‌ పట్టుదలతో ఉంది. మరోవైపు టీమిండియాకు షాక్‌ ఇచ్చి టోర్నీలో బోణీ కొట్టాలని శ్రీలంక భావిస్తోంది.

 భారత్ జట్టు ఈ మ్యాచులో గత జట్టుతోనే బరిలోకి దిగింది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖ పాండే, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌ యాదవ్‌

శ్రీలంక జట్టు

చమరి ఆటపట్టు (కెప్టెన్‌), హాసిని పెరీరా, ఉమేశ తిమాషిని, కరుణరత్నె, శశికల, హర్షిత, అనుష్క, కవిశా దిల్హారి, నీలాక్షి డి సిల్వా, సత్య, ప్రబోధని 

Tags:    

Similar News