Ind vs Pak: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉగ్రవాద ముప్పు.. ISIS నుంచి వార్నింగ్ మెసేజ్..!

భారత్‌-పాకిస్థాన్‌ టీ20 మ్యాచ్‌కి భద్రత ఎలా ఉందంటే..

Update: 2024-05-30 06:33 GMT

Ind vs Pak: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉగ్రవాద ముప్పు.. ISIS నుంచి వార్నింగ్ మెసేజ్..!

India vs Pakistan T20 World Cup Match Security: జూన్ 9న టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య హై ప్రొఫైల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో భద్రతకు సంబంధించి ఆందోళనలు పెరిగాయి. ఈ మ్యాచ్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కు పూర్తి పోలీసు బందోబస్తు ఉంటుంది.

నివేదికల ప్రకారం, ISIS-K (ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్) 'లోన్ వోల్ఫ్' దాడి గురించి కీలక ప్రకటన చేసింది. దీనిపై ISIS ఒక వీడియోను విడుదల చేసింది. మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తామని ప్రకటించింది. ఈ మొత్తం విషయానికి సంబంధించి, నసావు కౌంటీ పోలీసు కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ ముప్పును ధృవీకరించారు. అలాగే, భద్రతా చర్యల గురించి వివరించారు.

న్యూయార్క్‌ గవర్నర్‌ కాథీ హోచుల్‌ మాట్లాడుతూ భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించిన భద్రతకు సంబంధించి, మ్యాచ్ సజావుగా జరిగేలా భద్రతా అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.

Kathy Hochul కూడా Xలో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. క్రికెట్ ప్రపంచ కప్‌ సన్నాహకాలకు, మ్యాచ్‌కు హాజరయ్యే ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మా బృందం, చట్టపరమైన అధికారులతో కలిసి పని చేస్తోంది. భద్రతా చర్యలను పెంచాం, ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ మా పర్యవేక్షణ మరితం పటిష్టంగా మారుతుందని తెలిపారు.

ఐసెన్‌హోవర్ పార్క్ స్టేడియం జూన్ 3 నుంచి 12 వరకు 8 ICC T20 వరల్డ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఇందులో చిరకాల ప్రత్యర్థులైన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పోరు కూడా ఉంది. క్రిక్‌ఇన్‌ఫో, క్రిక్‌బజ్ నివేదికలలో, జూన్ 9న భారత్ vs పాకిస్తాన్ మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భద్రతా ముప్పు ఉందని, అందుకే ఐసెన్‌హోవర్ పార్క్ వద్ద భద్రతను పెంచారని తెలిపాయి.

భారత్‌-పాకిస్థాన్‌ టీ20 మ్యాచ్‌కి భద్రత ఎలా ఉందంటే..

నసావు కౌంటీ పోలీస్‌ కమిషనర్‌ ప్యాట్రిక్‌ రైడర్‌ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌కు సంబంధించి గత ఆరు నెలలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎలాంటి భద్రత ఉంటుందో ఊహించుకోవచ్చంటూ తెలిపారు.

- ఐసెన్‌హోవర్ పార్క్ ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంటుంది. అభిమానులు వచ్చే ముందు పోలీసులు ఆ ప్రాంతాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు.

- ప్రేక్షకులు స్టేడియం మైదానంలోకి ప్రవేశించే ముందు మెటల్ డిటెక్టర్ గుండా వెళ్లాలి. బ్యాగులు లేదా డ్రోన్‌లు స్టేడియం లోపల లేదా పైన ఏగిరేందుకు అనుమతి లేదు.

- ఐసెన్‌హోవర్ పార్క్ వద్ద పార్కింగ్ VIP టిక్కెట్ హోల్డర్‌లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇతర ప్రేక్షకులు కొద్ది దూరంలో అంటే నస్సావు కొలీజియం సమీపంలో పార్కింగ్ చేస్తారు.

రైడ్‌షేర్ డ్రాప్-ఆఫ్, పిక్-అప్ పాయింట్‌లు కూడా నియమించాం. ఫెడరల్, లోకల్, స్టేట్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మైదానంలో, బయట, గాలిలోనూ మా బలగాలు రక్షణగా నిలుస్తాయని తెలిపారు.

Tags:    

Similar News