ముంబై వాంఖడే టెస్టు రెండోరోజు అద్భుతాలు
IND vs NZ: ముంబైలోని వాంఖడేలో జరుగుతున్న రెండో టెస్టు రెండోరోజు ఆటలో రికార్డులు బ్రేకయ్యాయి.
IND vs NZ: ముంబైలోని వాంఖడేలో జరుగుతున్న రెండో టెస్టు రెండోరోజు ఆటలో రికార్డులు బ్రేకయ్యాయి. మొదట 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఒకే ఇన్నింగ్‌లో 10 వికెట్లు తీసిన ఆటగాడిగా కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ రికార్డులకు ఎక్కితే.. ఆ తర్వాత న్యూజిలాండ్‌ను 62 పరుగులకే చుట్టేసింది టీమిండియా. కాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టెస్టుల్లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. మొత్తంగా ఇవాళ 16 వికెట్లు నేల కూలాయి.
ఇక ఇదే సమయంలో కివీస్‌ను ఫాలో ఆన్ ఆడించే ఛాన్స్ ఉన్నప్పటికీ విరాట్ సెకండ్ ఇన్నింగ్ ఆడేందుకే మొగ్గు చూపాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పుజారా కివీస్ బౌలర్లపై ఎదురుడాడి ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మయాంక్‌తో కలిసి వికెట్ నష్టపోకుండా 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం పుజారా 29, మయాంక్ అగర్వాల్ 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.