India vs England: రోహిత్ ఆడకపోవడానికి కారణం ఏంటంటే..

India vs England: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్‌ శర్మ ఆడకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Update: 2021-03-13 14:43 GMT

రోహిత్ శర్మ (ఫొటో ట్విట్టర్)

India vs England: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్‌ శర్మ ఆడకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యాచ్ ముందు రోజుకూడా ఓపెనింగ్ చేసేది రాహుల్, రోహిత్ అని విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు. కానీ, తీరా టాస్ వేశాక, రోహిత్ కు రెస్ట్ ఇచ్చామని కోహ్లీ అనడంతో అంతా అవాక్కాయ్యారు. తుది జట్టులో రోహిత్‌ పేరు కనిపించకపోవడంతో అతడికి గాయమైందేమో అనుకున్నారంతా. కానీ, రొటేషన్‌ పద్ధతిలో భాగంగా రోహిత్ కు విశ్రాంతి ఇచ్చారని తర్వాత తెలిసింది.

వచ్చే వరల్డ్ కప్ కోసం సన్నాహాలు మొదలుపెట్టిన భారత్‌.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించే ఉద్దేశంతో రొటేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌కు రోహిత్‌ను పక్కన పెట్టింది. ఫామ్‌లో ఉన్న రోహిత్‌ దూరం కావడం తొలి మ్యాచ్‌లో భారత్‌కు చేటు చేసింది.

కాగా, సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మకు విశ్రాంతి కల్పించడాన్ని మాజీ ప్లేయర్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కోహ్లీ నిర్ణయంపై వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్రంగా మండిపడ్డాడు. రోహిత్‌ లేకపోవడంతోనే టీమిండియా ఘోరంగా ఓటమి పాలయిందని సెహ్వాగ్ అన్నాడు. కెప్టెన్‌ విశ్రాంతి తీసుకోనప్పుడు మరి ఇతర ప్లేయర్లకు ఎందుకు విశ్రాంతి కల్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్.. టీ 20లో కూడా అదరగొట్టేవాడని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో కోహ్లీ సేన ఎటువంటి మార్పులతో బరిలో దిగనుందనే విషయమై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News