India vs England: ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియాదే ఆధిపత్యం
India vs England: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న 4వ టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది.
India vs England: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న 4వ టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోయి 24 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 8, పుజారా 15 రన్స్ తో క్రీజులో ఉన్నారు. టీమిండియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. అండర్సన్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు కలిసి రాలేదు. పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో త్వరగా నే వికెట్లు కోల్సోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ టీంలో స్టోక్స్ (55 పరుగులు), లార్వెన్స్ (46) పర్వాలేదనిపించారు. అలాగే పోప్ (29), బెయిర్ స్టో (28 పరుగులు) రాణించారు. బెన్ స్టోక్స్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. 46 పరుగులతో డేనియల్ లారెన్స్ రాణించాడు.
ఇక భారత బౌలర్ అక్షర్ పటేల్ తన హవా కొనసాగించాడు. అతడు వేసిన 71వ ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. మొదటి బంతికి డేనియెల్ స్టంపౌట్ అవ్వగా నాలుగో బంతికి డామ్‌బెస్ (3) ఔటయ్యాడు. దీంతో అక్షర్ పటేల్ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అలాగే అశ్విన్ కూడా రాణించి 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ని పెవిలియన్ పంపాడు. అలాగే సిరాజ్ 2 వికెట్లతో రాణించారు. సుందర్ ఒక వికెట్ తీశాడు.