Ind vs Eng: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్

Ind vs Eng: లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్ * రెండో టెస్టుకు ముందు కీలక ఆటగాళ్లకు గాయాలు

Update: 2021-08-12 01:43 GMT

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండొవ టెస్ట్ మ్యాచ్ (ఫైల్ ఇమేజ్)

Ind vs Eng: భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లిష్‌ గడ్డపై చరిత్ర తిరుగరాయాలని కోహ్లీసేన పట్టుదలతో కనిపిస్తుంటే.. సొంతగడ్డపై సత్తాచాటేందుకు రూట్‌ గ్యాంగ్‌ ఉవ్విళ్లూరుతున్నది. తొలి టెస్టు గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేద్దామనుకున్న భారత ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. అటు.. అనుభవలేమితో ఆతిధ్య ఇంగ్లండ్‌ కొట్టుమిట్టాడుతోంది. శార్దుల్‌ ఠాకూర్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ గాయాలతో ఇరు జట్లు తుది ఎంపికపై తర్జనభర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగనుంది.

మరోవైపు.. రెండో టెస్టుకు ముందు ఇరు జట్లకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయ‌ర్స్ శార్దూల్ ఠాకూర్‌, స్టువ‌ర్ట్ బ్రాడ్ గాయాల‌పాల‌య్యారు. వార్మప్ గేమ్‌లో బ్రాడ్ గాయ‌ప‌డ‌గా.. టీమిండియా ఆల్‌రౌండ‌ర్ శార్దూల్‌కు తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. లార్డ్స్‌లో 150వ టెస్ట్ ఆడ‌బోతున్న బ్రాడ్‌కే కాదు.. అంత‌టి సీనియ‌ర్ బౌల‌ర్ సేవ‌లు మిస్ కానున్న ఇంగ్లండ్‌కు కూడా ఇది మింగుడు ప‌డ‌నిదే. ఇప్పటికే ఆ టీమ్ జోఫ్రా ఆర్చర్‌, క్రిస్ వోక్స్‌లాంటి బౌల‌ర్ల సేవ‌లు కోల్పోయింది.

మరోవైపు యువ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దూర‌మ‌వ‌డం కూడా ఇండియన్ టీమ్‌కు పెద్ద దెబ్బగా కనిపిస్తోంది. తొలి టెస్ట్‌లో శార్దూల్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో క‌లిపి శార్దూల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. నేటి నుంచి ప్రారంభం అయ్యే రెండో టెస్ట్‌కు శార్దూల్ దూర‌మైతే అత‌ని స్థానంలో అశ్విన్ లేదంటే పేస్ బౌల‌ర్లు ఇషాంత్‌, ఉమేష్‌ల‌లో ఒక‌రిని తీసుకునే అవ‌కాశం కనిపిస్తోంది. 

Tags:    

Similar News