ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (19) పరుగులు చేసి ఆగర్ బౌలింగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలి వికెట్ కు ఇద్దరు కలిసి 69 పరుగలు శుభారంభం ఇచ్చారు. దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 73 పరుగులు చేసింది. మరో ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 45 పరుగులతోనూ కెప్టెన్ కోహ్లీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫీల్డింగ్ సమయంలో గాయపడిన ధావన్ ఓపెనర్ గా దిగలేదు.