IND v AUS 1st ODI : డేవిడ్‌ వార్నర్‌ హాఫ్ సెంచరీ

వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 256పరుగుల లక్ష‌్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది.

Update: 2020-01-14 13:04 GMT
Warner

వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 256పరుగుల లక్ష‌్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (50 పరుగులు, 40బంతుల్లో, ఆరు ఫోర్లు, 2 సిక్సులు), ఆరోన్‌ ఫించ్‌(49, 42 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్) రాణిస్తున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఆస్ట్రేలియా 109 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు అర్థ సెంచరీలతో చెలరేగారు. వార్నర్ తన కెరీర్ లో 21వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇక మరో ఓపెనర్ కెప్టెన్ ఫించ్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు. రెగ్యులర్ కీపర్ రిషబ్ పంత్ కీపింప్ చేయడం లేదు. ఈ మార్పుకు కారణం టీం మెనేజ్ మెంట్ వెల్లడించలేదు. టీ20 ప్రపంచకప్ ఇది ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరపున రాహుల్ కీపింగ్ చేశాడు. 


 

Tags:    

Similar News