IND vs SL: షెడ్యూల్ ఖరారు.. 3ఏళ్ల తర్వాత శ్రీలంకకు టీంఇండియా

IND vs SL: ఎట్టకేలకు టీం ఇండియా శ్రీలంక టూర్ షెడ్యూల్ ఖరారైంది. 3 ఏళ్ల తర్వాత మెన్‌ ఇన్‌ బ్లూ టీం శ్రీలంకకు వెళ్లనుంది.

Update: 2021-05-11 11:04 GMT

ఇండియా వర్సెస్ శ్రీలంక టూర్ షెడ్యూల్ ఖరారు (ఫొటో ట్విట్టర్)

IND vs SL: ఎట్టకేలకు టీం ఇండియా శ్రీలంక టూర్ షెడ్యూల్ ఖరారైంది. దీంతో 3 ఏళ్ల తర్వాత మెన్‌ ఇన్‌ బ్లూ టీం శ్రీలంకకు వెళ్లనుంది. టీం ఇండియా చివరిసారి గా 2018లో శ్రీలంక టూర్ కి వెళ్లింది. తాజా పర్యటనలో భాగంగా శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ మేరకు కోహ్లీ సేన జులై 5న శ్రీలంకకు వెళ్తుంది. అయితే, ఈ పర్యటనకు టీం ఇండియా సెకండ్ టీంను పంపనుంది. మొదటి టీం జూన్ 2న ఇంగ్లాండ్ టూర్ కి బయలుదేరుతుంది. మొదటి టీం కోహ్లీ కెప్టెన్సీలో ఆడనుండగా, రెండవ టీం కు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ లేదా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవరించనున్నట్లు సమాచారం.

కాగా, శ్రీలంకకి వెళ్లిన తర్వాత భారత ఆటగాళ్లు కనీసం 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే 3 రోజులు ఆటగాళ్లు కేవలం హోటల్ గదులకే పరిమితం కానున్నారు. ఆ తరువాత 4 రోజులు హోటల్ దగ్గర్లోనే ప్రాక్టీస్, జిమ్‌లో కసరత్తులు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ సమయంలో భారత్ ఆటగాళ్లకు 3 సార్లు కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తారు.

శ్రీలంక టూర్ కి వెళ్లే ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యా, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉన్నారు. కాగా శ్రీలంక టూర్‌ లో కెప్టెన్ ఎవరనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. మిగిలిన టీం కోహ్లీ సారథ్యంలో ఇంగ్లాండ్ టూర్ కి బయలుదేరుతుంది.

భారత్, శ్రీలంక షెడ్యూల్:

వన్డే సిరీస్..

తొలి వన్డే - జులై 13

రెండో వన్డే - జులై 16

మూడో వన్డే - జులై 19

టీ20 సిరీస్..

తొలి టీ20 - జులై 22

రెండో టీ20 - జులై 24

మూడో టీ20  - జులై 27

* సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లను కొలంబోలోని ప్రేమదాస స్డేడియంలో నిర్వహించనున్నారు.

Tags:    

Similar News