India VS Australia : ఒత్తిడి కంగారూ జట్టు మీదే ఎక్కువగా కనిపిస్తోందా ?

ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్లు.. ఆధిక్యం సాధించాలని వీళ్లు ! ఆరాటం, పోరాటం మధ్య ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సిద్ధమవుతోంది

Update: 2021-01-06 15:13 GMT

ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్లు.. ఆధిక్యం సాధించాలని వీళ్లు ! ఆరాటం, పోరాటం మధ్య ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సిద్ధమవుతోంది టీమిండియా. మెల్‌బోర్న్‌లో మెరిసిన రహానే.. సిడ్నీలోనూ మ్యాజిక్ చేస్తాడా ? ఒత్తిడి కంగారూ జట్టు మీదే ఎక్కువగా కనిపిస్తోందా ?

రెండో టెస్టు విజయం అందించిన జోష్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. సిడ్నీలోనూ విక్టరీ కొట్టి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలన్న కసి మీద కనిపిస్తోంది. ఐతే కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమైనా రోహిత్ చేరడంతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఐతే ఇప్పుడు అందరి చూపు హిట్ మ్యాన్ మీదే కనిపిస్తోంది ! ఐపీఎల్‌లో అదరగొట్టిన రోహిత్ టెస్ట్ ఫార్మాట్‌లో ఎలా ఆడబోతున్నాడన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ఇక అటు ఆస్ట్రేలియా జట్టులోనూ వార్నర్, పకోస్కీ వచ్చి చేరారు. దీంతో మూడో టెస్ట్ మరింత ఆసక్తికరంగా మారిందిప్పుడు !

కోహ్లీ, షమీ, ఉమేష్ రెండో టెస్టుకు దూరమైనా తన మార్క్ కెప్టెన్సీతో రెండో టెస్టులో అద్భుత విజయాన్ని అందించాడు రహానే ! మెల్ బోర్న్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది. వార్నర్ కూడా జట్టులో చేరడంతో మరింత బలంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో జింక్స్‌ తన వ్యూహాలతో కంగారూలను కట్టడి చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సిడ్నీ టెస్టులో విజయం అందిస్తే రహానే కెరీర్ హైట్స్‌కు చేరుకున్నట్లే !

దాదాపు ఏడాది తర్వాత జట్టుతో కలిసిన రోహిత్ ఎలా ఆడబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ఆసీస్ పేస్ త్రయం స్టార్క్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌ను ఎలా ఎదుర్కొంటాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రోహిత్‌ నుంచి టీమిండియా భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. ఇక అటు రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పుజారా సిడ్నీ టెస్ట్ డూ ఆర్ డై అన్నట్లుగా ప్రిపేర్ అవుతున్నాడు. ఇక బౌలింగ్‌ భారం అంతా బుమ్రాపైనే ఉంది. వచ్చిన అవకాశాన్ని సైనీ, సిరాజ్‌ ఎలా ఉపయోగించుకుంటారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇక అశ్విన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం ఇండియాకు కలిసొచ్చే అంశం. రెండో టెస్ట్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తోంది. స్మిత్ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగం కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. 

Tags:    

Similar News