Boxing Day Test : ఆసీస్‌ను బెంబేలెత్తించిన టీమిండియా బౌలర్లు.. తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న2వ టెస్టు మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చలాయించింది.
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించారు. తొలి ఇన్నింగ్స్ లో 195 పరుగులకే అలౌట్ చేసి ఆసీస్ ను దెబ్బకొట్టారు. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో మార్కస్ లబుషేన్ లబుషేన్ (48; 132 బంతుల్లో 4x4)టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెడ్ (38), మాథ్యూ వెడ్ (30), టిమ్ పైనీ (13), గ్రీన్ (12) పరుగులతో పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.
ఆనంతరం తొలి ఇన్సింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 36 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ తన పేలవఫామ్ ను కొనసాగించాడు. మయాంక్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 11 ఓవర్లల్లో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ గిల్ (28), పుజారా (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్ స్టార్క్ ఒక వికెట్ వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముదు తొలుత ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీ టీమిండియాను బౌలింగ్ కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు మాథ్యూ వెడ్, జో బర్న్స్ ఆరంభించారు. ఐదవ ఓవర్ రెండో బంతికి బుమ్రా.. బర్న్స్ (0)ను ఔట్ చేశాడు. స్పిన్నర్ అశ్విన్ తన మాయాజాలం చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్న్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ టాప్ ఆర్డర్‌ను వణికించాడు. మొదటగా ఓపెనర్ మాథ్యూ వెడ్ (30)ను, స్టీవ్ స్మిత్ (0) డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకు ముందు మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ చేతికి చిక్కి డకౌట్ ఆయిన స్మిత్..ఈ మ్యాచ్ లో పుజారా క్యాచ్ ఇచ్చి మళ్లీ అదే పునరావృతం చేశాడు.
ఇక 11వ ఓవర్లోనే కెప్టెన్ అజింక్య రహానే స్పిన్నర్ రవిచంద్రన్ చేతికి బంతినిచ్చాడు. 13వ ఓవర్ ఐదవ బంతికి వెడ్ క్యాచ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజా అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. అశ్విన్ మాయాజాలానికి మరోసారి చిక్కాడు. మార్కస్ లబుషేన్ తన వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేస్తున్నాడు. మార్కస్ లబుషేన్ లబుషేన్ (48; 132 బంతుల్లో 4x4)ను ఔట్ చేయడంతో సిరాజ్ తన టెస్ట్ కెరీర్‌లో తొలి వికెట్ పడగొట్టాడు. సిరాజ్ వేసిన 49వ ఓవర్ 3వ బంతి లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని.. లబుషేన్ ఫ్లిక్ చేయడంతో శుభ్‌మన్ గిల్ క్యాచ్ అందుకున్నాడు.
ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీ, గ్రీన్ సహకారంతో ఇన్నింగ్స్ ప్రయత్నం చేశాడు. భారత బౌలర్లు మ్యాచ్ ను ఆసీస్ చేతికి వెళ్లకుండా చేయడంలో సఫలికృతం అయ్యారు. మూడో సెషన్ లో 73. 3ఓవర్లలో 195 పరుగులకే పరిమితమైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించింది. మొత్తానికి మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చలాయించింది.