WTC ఫైనల్ ఆడే భారత జట్టు ఇదే.. వికెట్ కీపర్ గా తెలుగు అబ్బాయి..!
WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023కు టీమ్ ఇండియా సిద్ధమైంది.
WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023కు టీమ్ ఇండియా సిద్ధమైంది. 15 మందితో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. తెలుగు ఆటగాడు కేఎస్. భరత్ టీంలో చోటు దక్కించుకున్నాడు. అటు ఐపీఎల్ లో మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టిన రహానేకు టెస్ట్ జట్టులో స్థానం కల్పించారు. అలాగే మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ యాదవ్ కూడా బెర్త్ కన్ ఫామ్ చేసుకున్నాడు.
భారత్ జట్టు ఇదే:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, ఛైతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, కేఎస్. రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు ఆస్ట్రేలియా, భారత్ చేరిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 తేదీల మధ్య ఓవల్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఒకవేళ మ్యాచ్ ఫలితం తేలకుంటే 12వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు.