WTC Final: డబ్యూటీసీ ఫైనల్‌లో గెలుస్తాం: టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా

WTC Final: న్యూజిలాండ్ టీంపై డబ్యూటీసీ ఫైనల్‌లో కచ్చితంగా గెలుస్తామని టీం ఇండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా అన్నారు.

Update: 2021-05-20 09:12 GMT
పుజారా (ఫొటో ట్విట్టర్)

WTC Final: న్యూజిలాండ్ టీంపై డబ్యూటీసీ ఫైనల్‌లో కచ్చితంగా గెలుస్తామని టీం ఇండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా జూన్ 18 నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ తో టీం ఇండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జూన్ 2న ఇంగ్లాండ్‌ కి టీం ఇండియా బయలుదేరనుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పుజారా మాట్లాడి, న్యూజిలాండ్ టీంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

''ఇంగ్లాండ్ దేశంలో టీం ఇండియా తప్పక విజయాల్ని సాధిస్తుంది. కొన్ని నెలలుగా విదేశాల్లో భారత్ జట్టు అద్బుతంగా రాణిస్తోంది. ఈ విజయాలు జట్టు‌లో ఆత్మవిశ్వాసం నింపాయి. ప్రణాళికల్ని కరెక్ట్‌గా అమలు చేయగలిగితే.. తప్పకుండా ఇంగ్లాండ్ గడ్డపై ఆధిపత్యం మాదే. డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్ వేదికగా ఆడుతున్నాం. కాబట్టి.. రెండు జట్లకీ గెలిచేందుకు అవకాశాలు సమానంగా ఉంటాయని'' పుజారా వెల్లడించాడు.

డబ్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్ తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఐదు టెస్టుల సిరీస్‌‌లో టీం ఇండియా తలపడనుంది. చివరిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై 2007లో భారత్ టెస్టు సిరీస్ గెలించింది. కానీ, గతేడాది న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఓడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇంగ్లాండ్ టీంలపై టెస్టు సిరీస్‌ లు గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది టీం ఇండియా.

బుధవారం ముంబయికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటుంది. ఆ తరువాత ముంబై నుంచి స్పెషల్ ఛార్టర్ ప్లైట్‌లో ఇంగ్లాండ్‌ దేశానికి బయలుదేరనుంది. అక్కడి చేరుకున్నాక కూడా వారం పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు టీం ఇండియా ఆటగాళ్లు.

Tags:    

Similar News