India VS Australia: ఫైనల్‌లో తడబడిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ 241రన్స్

India VS Australia: భారత స్పినర్లు మాయ చేస్తారా..? కంగారులను కట్టడి చేస్తారా..?

Update: 2023-11-19 12:37 GMT

India VS Australia: ఫైనల్‌లో తడబడిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ 241రన్స్

India VS Australia: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. భారీ స్కోర్ చేయలేకపోయారు. ఆసీస్ ముందు స్పల్ప లక్ష్యాన్ని పెట్టారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. 50ఓవర్లకు 240పరుగులకు ఆలౌటైంది. కేవలం ఆసీస్ ముందు 241పరుగుల టార్గెట్‌నే ఉంచారు. కంగారుల బౌలింగ్ ముందు భారత బ్యాటర్లు నిలువలేకపోయారు. కేఎల్ రాహుల్ 66, కోహ్లీ 54, రోహిత్ 47 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు అంతా విఫలం అయ్యారు. ఓపెవన్ గిల్, శ్రేయస్, జడేజా, సూర్యకుమార్ తీవ్రంగా నిరాశ పరిచారు. కోహ్లీ, రాహుల్ పోరాటంతో ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.

కల చెదిరింది. కప్ చేజారింది. పేలవ ప్రదర్శనతో వరల్డ్‌కప్ ట్రోఫిని కంగారులకు అప్పగించింది టీమిండియా. ఫైనల్ వరకు అద్భుతంగా ఆడిన రోహిత్‌ సేన.. ఆఖరి మ్యాచ్‌లో చేతులు ఎత్తేశారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైంది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేధించి.. కప్‌ను ఎగరేసుకపోయింది ఆసీస్ జట్టు. కోట్లాది భారత క్రికెట్ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చెల్లారు.

Tags:    

Similar News