Test Records: 91 ఏళ్లలో తొలిసారి.. ఒక్క బంతి పడకుండా టెస్ట్ మ్యాచ్ రద్దు..!

Afghanistan Vs New Zealand Test Match: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నోయిడా టెస్ట్ మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండా రద్దు అయింది.

Update: 2024-09-13 06:48 GMT

Test Records: 91 ఏళ్లలో తొలిసారి.. ఒక్క బంతి పడకుండా టెస్ట్ మ్యాచ్ రద్దు..!

Afghanistan Vs New Zealand Test Match Washed Out: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నోయిడా టెస్ట్ మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండా రద్దు అయింది. వర్షం కారణంగా, నాలుగు రోజుల ఆట రద్దైంది. దీంతో ఐదో రోజు ఆట కూడా రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా వేయలేదు. టాస్ కూడా వేయలేదు. ఒక్క బంతి కూడా వేయకుండా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దవడం 91 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విధంగా ఆఫ్ఘనిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో ఒక టెస్టు మ్యాచ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.

సెప్టెంబరు 9 నుంచి నోయిడాలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్‌లో టాస్ కూడా పడలేదు. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురవకపోయినా, రాత్రి కురిసిన వర్షం కారణంగా మైదానం ఎండిపోలేని విధంగా తడిసిపోయింది. నోయిడా స్టేడియంలో ఇతర స్టేడియాల మాదిరిగా మంచి సౌకర్యాలు లేవు. నిర్వహణ లోపంపై అనేక నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైదానాన్ని ఆరబెట్టడానికి విద్యుత్ ఫ్యాన్లు ఉపయోగించారు. అంతే కాకుండా చాలా చోట్ల తవ్వి భూమి ఉపరితలం మార్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

నోయిడాలో నిర్వహణ లోపం ఉందని ఆరోపించిన ఆఫ్ఘానిస్తాన్..

ఇదిలా ఉంటే, తాము మళ్లీ ఆడేందుకు నోయిడాకు రాబోమని ఆఫ్ఘనిస్థాన్ బోర్డు కూడా తెలిపింది. ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. స్టేడియం సౌకర్యాలు సరిగా లేవు, భోజన ఏర్పాట్లు సరిగా లేవు అంటూ ఆరోపణలు చేసింది.

91 ఏళ్ల చరిత్రలో ఒక్క బంతి కూడా వేయకుండా వర్షం కారణంగా ఏదైనా టెస్ట్ మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇరు జట్లూ తీవ్ర నిరాశకు గురయ్యాయి.

Tags:    

Similar News