ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా?

లాక్ డౌన్ ప్రభావం అన్నీ రంగలపైన పడింది. ఇక క్రీడా రంగం విషయానికి వచ్చేసరికి పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీసులు రద్దు అయిపోయాయి.

Update: 2020-05-22 11:46 GMT

లాక్ డౌన్ ప్రభావం అన్నీ రంగలపైన పడింది. ఇక క్రీడా రంగం విషయానికి వచ్చేసరికి పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీసులు రద్దు అయిపోయాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఐపీఎల్ కూడా వాయిదా పడింది. అయితే ఆస్ట్రేలియా వేదికగా జ‌ర‌గాల్సిన టీ 20 ప్రపంచ‌క‌ప్‌ ను కూడా మరోసారి వాయిదా వేయ‌డమే కరెక్ట్ అని ఐసీసీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి కరోనా వ్యాప్తి ఇంకా కంట్రోల్లో లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇదే విషయాన్ని వచ్చే వారం ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం..

ఈ నెల 26 నుంచి 28 వరకు ఐసీసీ తన అనుబంధ బోర్డుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. అనంతరం దీనిపైన ఓ ప్రకటనను రిలీజ్ చేయనుంది. అంతేకాకుండా ఐసీసీ ఛైర్మన్‌ పదవి కాలం ముగుస్తుండడంతో పదవీ భర్తీపైన కూడా చర్యలు తీసుకోనుంది. ఇక ముందుగా ఈ మెగాటోర్నీని అక్టోబర్-నవంబర్ నెలలో నిర్వహించాలని ఐసీసీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. కానీ దేశంలో కరోనా వ్యాప్తి పెరగడంతో వాయిదా వేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియాలో తిరిగి ఈ మెగా టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి / మార్చి నెలలో నిర్వహించాలని ప్లాన్ చేస్తునట్టుగా తెలుస్తోంది. త్వరలో దీనిపైన ఓ క్లారిటీ రానుంది.

Tags:    

Similar News