ICC: సెప్టెంబర్ 10 లోపు టీ20 వరల్డ్ కప్ ఆటగాళ్ళ జాబితా పంపండి

Update: 2021-08-16 09:24 GMT

ఐసిసి టీ20 ప్రపంచ కప్ 2021 (ఫోటో: ఐసిసి) 

ICC World Cup 2021: అక్టోబర్ లో ప్రారంభం కానున్న ఐసిసి టీ20 ప్రపంచ కప్ 2021లో పాల్గొనే క్రికెట్ జట్లకు తమ ఆటగాళ్ళ జాబితాని సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. కరోనా కారణంగా యూఏఈ, ఒమన్ లో మ్యాచ్ లు నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే వేదికలను కూడా ప్రకటించిన ఐసీసీ.. వరల్డ్ కప్ కోసం కేవలం 15 మంది ఆటగాళ్ళతో పాటు 8 మంది సహాయకుల జాబితా మాత్రమే పంపాలని సూచించింది. అయితే కరోనని దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో కావాలనుకుంటే అదనపు ఆటగాళ్ళను తీసుకొని రావొచ్చని కాకపోతే 15 మంది ఆటగాళ్ళు, 8 మంది సహకా సిబ్బంది ఖర్చులు మినహా అదనపు ఆటగాళ్ళ పూర్తి ఖర్చులు ఆ టీం యాజమాన్యమే భరించాలని ఐసిసి తెలిపింది.

అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు జరగనున్న పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ లోని టీంలో ఆటగాళ్ళ తుది జాబితాలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వరల్డ్ కప్ పర్యటనకి 5 రోజుల ముందు తెలపాలని ఐసీసీ ప్రకటన చేసింది. టీ20 ప్రపంచ కప్ 2021 గ్రూప్ 1 స్టేజి లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్.. గ్రూప్ 2 లో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, న్యూజిలాండ్ జట్లు సూపర్ 12 కి ఎంపిక అయ్యాయి. ఇక మరోపక్క ఐపీఎల్ 2021 ను కూడా బీసిసిఐ సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా నిర్వహించనుంది.    

Tags:    

Similar News