ICC Hall of Fame: మరో పది మంది దిగ్గజాలకు 'హాల్ ఆఫ్ ఫేమ్' లో చోటు!
డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా 10 మంది దిగ్గజ ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చేందుకు ఐసీసీ నిర్ణయిచింది.
ICC Hall of Fame: డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా 10 మంది దిగ్గజ ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చేందుకు ఐసీసీ నిర్ణయిచింది. క్రికెట్ లో ఐదు శకాల నుంచి ఇద్దరేసి ఆటగాళ్లకు ఈ గౌరవం దక్కనున్నట్లు పేర్కొంది. ఇప్పటికేఈ జాబితాలో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ జాబితాను 103 కు పెంచనున్నట్లు ఐసీసీ పేర్కొంది.
జూన్ 18న సౌథాంప్టన్‌లో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్పెషల్ ఎడిషన్ ఉంటుందని గురువారం ఐసీసీ తమ అధికారిక ట్విటర్ లో పేర్కొంది. చారిత్రక మ్యాచ్ సందర్భంగా.. క్రికెట్ చరిత్రను సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు ఐసీసీ పేర్కొంది. ఇందులో భాగంగా క్రికెట్‌కు తమ వంతు సేవలు అందించిన 10 మంది దిగ్గజాలను సత్కరించుకోబోతున్నట్లు తెలిపింది. వీరిని గౌరవించుకోవడం మన కర్తవ్యమని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ పేర్కొన్నారు.
ఈ లెజండరీ ఆటగాళ్లు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆయన వెల్తడించారు. క్రికెట్‌ను ఐదు శకాలుగా విభజించామని పేర్కొన్నారు.
ప్రారంభ క్రికెట్ శకం (1918 కంటే ముందు),
ఇంటర్ వార్ క్రికెట్ శకం (1918-1945),
యుద్ధం తర్వాత క్రికెట్ శకం (1946-1970),
వన్డే క్రికెట్ శకం(1971-1995),
ఆధునిక క్రికెట్ శకం (1996-2016)
ఈ ఐదు శకాల్లో ఒక్కో శకం నుంచి ఇద్దరేసి ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఓటింగ్ అకాడమీ, హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో సజీవంగా ఉన్న సభ్యులు, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతినిధి, ప్రముఖ క్రికెట్ జర్నలిస్టులు, సీనియర్ ఐసీసీ సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. అయితే వీరి ఓటింగ్ ఆధారంగా ఇప్పటికే ఆ పది మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. జూన్ 13న ఈ జాబితాను ఐసీసీ డిజిటల్ మీడియా ఛానెళ్ల ద్వారా లైవ్‌లో ప్రకటిస్తామని జెఫ్ వెల్లడించారు.