Match Fixing: ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ కొరడా .. 8ఏళ్లు నిషేధం

Match Fixing: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాల్పడ్డ ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది.

Update: 2021-03-17 03:15 GMT

ఐసీీసీ (ఫైల్ ఫోటో )

Match Fixing: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ నిషేదం విధించింది. 2019 టీ20 వరల్డ్ కప్ అర్హత పోటీల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు యూఏఈ షైమన్‌ అన్వర్ బట్‌. క్రికెటర్లు మహ్మద్‌ నవీద్‌లపై‌ అంతర్జాతీయ క్రికెట్ మండలిఏ(ఐసీసీ) మంగళవారం కొరడా ఝళిపించింది. ఈ ఇద్దరి క్రికెటర్లపై ఏకంగా 8ఏళ్లుపాటు నిషేధం విధించింది. 2019 అక్టోబర్‌ 16 నుంచి ఈ నిషేదం అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఇద్దరూ ప్రాథమిక విచారణలో తప్పు చేసినట్టు తేలడంతో ఐసీసీ రెండేళ్ల క్రితమే వారిపై తాత్కాలిక నిషేధం అమలు చేసింది.

ఆర్టికల్ 2.4.4, ఆర్టికల్ 2.1.1 ప్రకారం ఇద్దరిని దోషులుగా పరిగణించి వారిపై చర్యలు తీసుకుంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి ఎవరైనా కలిసినా, ఫిక్సింగ్ చేయమని ప్రేరేపించినా, మ్యాచ్ వివరాలు అడిగినా ఐసీసీ అధికారులకు తెలియజేయాలి. ఈ ఇద్దరు ఆ వివరాలను వెల్లడించలేదు. గతంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్,ప్రస్తుత క్రికెటర్ షకీబుల్ హాసన్ పై నిషేదం రెండేళ్ల పాటు నిషేదం విధించిన సంగతి తెలిసిందే.

అయితే 'మహ్మద్‌ నవీద్‌, షైమన్‌ అన్వర్‌ బట్ యూఏఈ తరఫున అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడారు. నవీద్‌ జట్టుకు కెప్టెన్ కూడా. జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీశాడు. అన్వర్‌ యూఏఈ జట్టుకి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గానూ సేవలందించాడు. సుదీర్ఘ కాలంగా ఆడుతున్న వీరికి మ్యాచ్‌ ఫిక్సర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దాంతో వారు సహచరులు, ప్రత్యర్థులు, అభిమానులను మోసం చేశారు' అని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ ఓ ప్రకటనలో తెలిపారు.

రైట్ హ్యాండ్ పేసరైన మహ్మద్‌ నవీద్ (32 ఏళ్లు)‌ యూఏఈ తరఫున 39 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. వన్డేల్లో 53 వికెట్లు, టీ20ల్లో 37 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 5 వికెట్ల ప్రదర్శన ఓసారి చేశాడు. అంతేకాదు యూఏఈ జట్టుకు సారథ్యం వహించాడు.

ఇక 42 ఏళ్ల మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్ షైమన్‌ అన్వర్‌‌ బట్‌ 40 వన్డేలు, 32 టీ2లు ఆడాడు. వన్డేల్లో 1219 రన్స్, టీ20ల్లో 971 పరుగులు చేశాడు. వన్డే టీ20 ఒక్కో సెంచరీ కూడా చేశాడు. యూఏఈ జట్టులోని కీలక ఆటగాళ్లపై నిషేదం విధించడంతో ఆజట్టకు పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి. గత కొన్ని ఏళ్లుగా యూఏఈ జట్టు టీ20లు, వన్డేల్లో నిలడగా రాణిస్తుంది. ప్రపంచకప్ క్వాలీఫైర్ మ్యాచ్ ల్లో అద్శుత ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టుకు దూరం కావడంతో.. మిగతా ఆటగాళ్లపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News