Arjun Tendulkar: ముంబాయి జట్టులో సచిన్ తనయుడు !?
Arjun Tendulkar: యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ 2020లో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఏంట్రీ ఇవ్వనున్నడా? ముంబయి ఇండియన్స్ జట్టు తరుపున ఆడానున్నాడా? అంటే అవును అనే సమాధానాలు వస్తున్నాయి.
Arjun Tendulkar: యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ 2020లో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఏంట్రీ ఇవ్వనున్నడా? ముంబయి ఇండియన్స్ జట్టు తరుపున ఆడానున్నాడా? అంటే అవును అనే సమాధానాలు వస్తున్నాయి. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న అర్జున్ టెండూల్కర్ క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని ముంబయి జట్టుతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఆ టీమ్ సభ్యులతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో దిగిన ఫోటోలను అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ వాదన మరింత బలం చేకురింది.
కానీ ముంబయి జట్టులోకి అర్జున్‌ని తీసుకున్నట్లు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. యూఏఈకి వెళ్లే క్రమంలో అన్ని జట్లు కూడా తమతో పాటు నెట్స్ బౌలర్లని కూడా కొంత మందిని తీసుకెళ్లాయి. అందులో భాగంగానే.. అర్జున్ కూడా ముంబయి టీమ్‌తో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ.. ఈ విషయాన్ని ఆ జట్టు రహస్యం ఉంచింది.
టోర్నీలో ఏ క్రికెటరైనా గాయపడితే..? అతని స్థానంలో మరొక ఆటగాడ్ని తీసుకునే వెసులబాటుని బీసీసీఐ కల్పిస్తోంది. కానీ.. అతను వేలంలోకి వచ్చి ఉండాలనేది గత ఏడాది వరకూ ఒక రూల్‌గా ఉండేది. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వేలంలోకి రాకపోయినా సదరు ఆటగాడు యూఏఈలో ఉండి బయో- సెక్యూర్ బబుల్ పరిధిలో ఉంటే తీసుకోవచ్చని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో.. ముంబయి ఇండియన్స్ టీమ్‌లోకి అర్జున్ టెండూల్కర్ వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.