IND vs SL: శ్రీలంక పర్యటనకు భారత జట్టు.. కెప్టెన్‌గా రోహిత్ కాదు.. టీ20, వన్డేలకు సారథిగా ఎవరంటే?

IND vs SL ODI Series Indian Captain: టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత, భారత జట్టు తన మొదటి ODI సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో పర్యటించనుంది.

Update: 2024-07-09 05:27 GMT

IND vs SL: శ్రీలంక పర్యటనకు భారత జట్టు.. కెప్టెన్‌గా రోహిత్ కాదు.. టీ20, వన్డేలకు సారథిగా ఎవరంటే?

IND vs SL ODI Series Indian Captain: టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత, భారత జట్టు తన మొదటి ODI సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో పర్యటించనుంది. భారత జట్టు ఆగస్టు నెలలో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. అయితే, ఈ సిరీస్‌కు ముందే కెప్టెన్సీపై చర్చ మొదలైంది. ఎందుకంటే రోహిత్ శర్మతోపాటు ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇన్‌సైడ్‌స్పోర్ట్స్ నివేదిక ప్రకారం, గత మూడు నెలలుగా నిరంతరాయంగా ఆడుతున్న ఈ వెటరన్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని BCCI నిర్ణయించింది. ముఖ్యంగా డిసెంబర్-జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ నుంచి ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ వరకు నిరంతరంగా క్రికెట్ ఆడుతోన్న రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

BCCI ప్రకారం - ఇద్దరు ఆటగాళ్లు ODI జట్టులో ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ వీరికి మంచి ప్రాక్టీస్ అవుతుందని అంటున్నారు. సెప్టెంబరు-జనవరి మధ్య భారత్ 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నందున ఇద్దరు ఆటగాళ్లు రాబోయే కొద్ది నెలలు టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు.

వాస్తవానికి, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ బంగ్లాదేశ్‌తో 2 టెస్టు మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌తో 3 టెస్టు మ్యాచ్‌లు, ఆపై ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, సెలెక్టర్లు, సీనియర్ ఆటగాళ్ల పనిభారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

భారత జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

రోహిత్ గైర్హాజరీతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను కూడా విస్మరించలేం.

శ్రీలంకలో భారత్ పర్యటన ఎప్పుడు?

భారత క్రికెట్ జట్టు జులై, ఆగస్టు 2024లో శ్రీలంక క్రికెట్ జట్టుతో ఆడేందుకు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.

టీ20 సిరీస్: భారత జట్టు జులై 27న శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్, జులై 28న రెండో టీ20, చివరి మ్యాచ్ జూలై 30న ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మూడు టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటల నుంచి మొదలుకానున్నాయి.

వన్డే సిరీస్: శ్రీలంకతో భారత్ తొలి వన్డే మ్యాచ్ ఆగస్టు 2న, రెండో వన్డే ఆగస్టు 4న, మూడో వన్డే ఆగస్టు 7న జరగనుంది. మూడు ODI మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 నుంచి మొదలుకానున్నాయి.

Tags:    

Similar News