IND vs NZ: టీమిండియాకు డేంజర్ బెల్స్.. మూడోరోజు మైదానంలోకి రాని పంత్..
IND vs NZ: భారత్ - న్యూజిలాండ్ టీంల (IND vs NZ)మధ్య బెంగళూరులో తొలి టెస్టు జరుగుతోంది. తొలి రోజు వర్షంతో కనీసం టాస్ కూడా పడలేదు.
IND vs NZ: భారత్ - న్యూజిలాండ్ టీంల (IND vs NZ)మధ్య బెంగళూరులో తొలి టెస్టు జరుగుతోంది. తొలి రోజు వర్షంతో కనీసం టాస్ కూడా పడలేదు. అయితే, రెండో రోజు వర్షం ఆగిపోవడంతో.. మ్యాచ్ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, బారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రిషభ్ పంత్(20) ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇక నేడు మూడో రోజు ఆట మొదలైంది. కానీ, పంత్ మైదానంలోకి రాలేదు.
ఈ క్రమంలో పంత్ అసలు బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పంత్ గాయంపై ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐకు ట్వీట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కూడా పంత్ గాయంపై అప్ డేట్ ఇచ్చింది. వైద్యులు పంత్‌ను పర్యవేక్షిస్తున్నారని, మళ్లీ మైదానంలోకి దిగేందుకు కృషి చేస్తున్నారంటూ ప్రకటించింది. ప్రస్తుతం పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.
అసలేమైందంటే?
నిన్న న్యూజిలాండ్ ఇన్నింగ్ 37వ ఓవర్‌లో పంత్ గాయపడ్డాడు. జడేజా వేసిన చివరి బంతి తక్కువ ఎత్తులో వచ్చింది. ఇది నేరుగా పంత్ కుడి కాలికి బలంగా తగిలింది. నొప్పిని తట్టుకోలేకపోయిన పంత్.. మైదనాంలోనే తెగ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో మైదానంలోకి వచ్చి పంత్‌ను పరీక్షించాడు. చివరకు మైదానం బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే, రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్‌కు.. కుడి మోకాలికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాలికి బంతి తగలడంతో మైదానం వీడి వెళ్లాల్సి వచ్చింది.
బరిలోకి రాకపోతే భారత్‌కు భారీ నష్టం..
తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాకపోతే రోహిత్ సేన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓటమి తప్పించుకోవాలంటే టీమిండియాకు భారీ స్కోర్‌తోపాటు, కీలక భాగస్వామ్యాలు కూడా అవసరం. మరి ఇలాంటి సమయంలో పంత్ బ్యాటింగ్‌కు రాకపోతే.. టీమిండియా మిడిలార్డర్ బలహీనంగా మారుతుంది. కాగా, బీసీసీఐ అందించిన సమాచారంతో.. పంత్ రెండో ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి కోలుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించాడు. పంత్ విషయంలో తొందరపడకూడదని నిర్ణయించుకున్నాం. ఈ విషయంలో రిస్క్ తీసుకోలేం అంటూ చెప్పుకొచ్చాడు.