IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ? కీలక అప్‌డేట్ మీకోసం..!
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 కంటే ముందు జరగబోయే మెగా వేలం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 కంటే ముందు జరగబోయే మెగా వేలం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలానికి సంబంధించిన అధికారిక తేదీ ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అయితే, 2025 మెగా వేలాన్ని నవంబర్ 24 లేదా 25 న విదేశీ గడ్డపై నిర్వహించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం దుబాయ్‌లో జరిగింది.
గత సారి మాదిరిగానే ఈసారి కూడా భారత్ వెలుపల వేలం నిర్వహించవచ్చు. అయితే, ఈసారి దుబాయ్‌కి భిన్నమైన స్థలాన్ని ఎంచుకోవచ్చు. ఇంతకుముందు వెలువడిన కొన్ని నివేదికలలో, 2025 IPL కోసం మెగా వేలం సౌదీలో నిర్వహించవచ్చని పేర్కొంది. క్రిక్‌బజ్ నివేదికలో, మెగా వేలానికి సింగపూర్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం, బీసీసీఐ ప్రస్తుతం వేలం వేదికను పరిశీలిస్తోంది. ఇంకా ఏ ప్లేస్ డిసైడ్ చేయలేదంట. దీని కారణంగా, వేలం వేదికకు సంబంధించి BCCI నుంచి ఫ్రాంచైజీకి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే, BCCI వేలం వేదిక గురించి అన్ని ఫ్రాంచైజీలకు త్వరలో తెలియజేయనుంది. ఎందుకంటే వేలం భారతదేశం వెలుపల నిర్వహించేందుకు సిద్ధమైతే.. ఫ్రాంచైజీ తన ప్రతినిధులందరికీ వీసా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
రిటెన్షన్ జాబితా ప్రకటించాల్సి ఉంది..
మెగా వేలానికి వేదిక, తేదీతో పాటు, జట్ల రిటెన్షన్ జాబితా కూడా ఇంకా విడుదల కాలేదు. 2025 IPL మెగా వేలానికి ముందు జట్లు మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చని IPL అధికారికంగా స్పష్టం చేసింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్, గరిష్టంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉండవచ్చు. నివేదికల ప్రకారం, అన్ని జట్లూ అక్టోబరు 31న బీసీసీఐకి రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది.