Video: ఘోర పరాజయం.. పేలవ ఫాం.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్‌కు సిద్ధమైన టీమిండియా స్టార్ ప్లేయర్?
KL Rahul May Retirement: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
KL Rahul May Retirement: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అందరూ ఫ్లాప్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్, కోహ్లీ, పంత్ అర్ధసెంచరీలు చేయగా, సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేశాడు. దీని ఆధారంగా భారత్ 462 పరుగులు చేసి న్యూజిలాండ్‌కి 107 పరుగుల లక్ష్యాన్ని అందించింది. రెండు వికెట్ల నష్టపోయి విజిటింగ్ టీమ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్స్ పరుగులు రాబట్టారు. అయితే, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కేఎల్ రాహుల్ ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. ఆ తర్వాత బెంగళూరు పిచ్‌పై అతను చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఆయన రిటైర్మెంట్‌పై పుకార్లు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.
పిచిన్ తాకి ఏం చేశాడంటే..
బెంగళూరులో ఓటమి తర్వాత కేఎల్ రాహుల్ పిచ్‌ను తాకాడు. రాహుల్ చేసిన ఈ చర్య సచిన్ టెండూల్కర్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను అందరికీ గుర్తు చేసింది. సచిన్ తన కెరీర్‌లో చివరి టెస్టులో పిచ్‌ను తాకి థ్యాంక్స్ కూడా చెప్పాడు. కేఎల్ రాహుల్ పిచ్‌ని టచ్ చేసిన తర్వాత, అనేక రకాల పుకార్లు మొదలయ్యాయి. రాహుల్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకుంటాడని కొంతమంది అంటుంటే.. ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ చేస్తాడని మరికొంతమంది చెబుతున్నారు.
ఇటీవల రాహుల్ ఫామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సున్నా, రెండవ ఇన్నింగ్స్‌లో 12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
గత ఐదు ఇన్నింగ్స్‌లలో కేఎల్ రాహుల్ ప్రదర్శన గురించి మాట్లాడితే, అతను తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాట్ నుంచి కేవలం ఒక అర్ధసెంచరీ మాత్రమే వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో రెండో టెస్టులో 68 పరుగులు చేశాడు.