Harbhajan Singh: జట్టులోకి ఇషాన్ కిషన్, శార్దుల్ వస్తే విజయం మనదే

Update: 2021-10-26 07:17 GMT

Harbhajan Singh: ఇషాన్ కిషన్, శార్దుల్ వస్తే విజయం మనదే

Harbhajan Singh: కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూసిన భారత్ - పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయ పాలవడంతో అభిమానులు తీవ్ర నిరాశకి గురైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం పలువురు క్రీడా పండితులు టీమిండియా ప్రదర్శనపై విమర్శలు చేయగా మరికొంతమంది ఆటలో ఇవన్ని సహజమేనని భారత జట్టుకు ధైర్యాన్నిచ్చారు. ఇక భారత మాజీ ఆటగాళ్ళు మాత్రం రానున్న మ్యాచ్ లకు జట్టులో కొన్ని మార్పులు చేయాలని సూచిస్తున్నారు.

అదేకోవలో తాజాగా భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ చేరాడు. న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లు గా రావాలని, మూడవ స్థానంలో విరాట్ కోహ్లి, నాలుగవ స్థానంలో రాహుల్, అయిదవ స్థానంలో రిషబ్ పంత్, ఆరవ స్థానంలో హార్దిక్ పాండ్య, ఎడవ స్థానంలో రవీంద్ర జడేజాని ఆడించాలని హర్భజన్ సింగ్ సూచించాడు. ఇక శర్దుల్ టాకూర్ ఎనిమిదవ స్థానంలో, చివరికి బుమ్రా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి రావాలని హర్భజన్ తెలిపాడు.ఇక భారత్ - న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 31 ఆదివారం రోజున దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.

Tags:    

Similar News