India vs New Zealand: సౌతాంప్టన్‌లోనే WTC ఫైనల్: గంగూలీ

WTC Final: భారత్, న్యూజిలాండ్ మధ్య ICC World Test Championship ఫైనల్ సౌతాంప్టన్‌లో జరుగుతుందని సౌరవ్ గంగూలీ అన్నారు.

Update: 2021-03-08 13:55 GMT

గంగూలీ (ఫొటో హన్స్ ఇండియా)

India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ సౌతాంప్టన్ లో జరుగుతుందని బీసీసీఐ ఛీప్ సౌరవ్ గంగూలీ సోమవారం వెల్లడించారు.

కాగా, మొదట WTC ఫైనల్ లండన్‌లోని ప్రసిద్ధ స్టేడియం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరగాల్సి ఉంది. కానీ, యూకే లోని కోవిడ్ (COVID-19) పరిస్థితి కారణంగా వేదికను సౌతాంప్టన్ లోని ది ఏగాస్ బౌల్ స్టేడియానికి మార్చామని ఆయన అన్నారు. అయితే ఈ స్టేడియం మార్పు చాలా కాలం క్రితమే చేసినట్లు ఊహాగానాలు వచ్చాయి.

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు నేనేు హాజరుకావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని అన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు చాలా శ్రమించారు. ఇందులో భాగమైన ప్రతీ ఒక్కరికి, ముఖ్యంగా కోహ్లీ, రహానే కు ప్రత్యేక అభింనందనలు. ఈ ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి, ట్రోఫి ని టీం ఇండియా సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నానని బీసీసీఐ ఛీప్ అన్నారు.

టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 3-1 తేడాతో ఓడించి, విరాట్ కోహ్లీ సేన జూన్ 18 నుంచి జరగబోయే డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించారు. నేను ప్రస్తుతం చాలా ఫిట్ గా ఉన్నానని తెలిపారు. పింక్ బాల్ టెస్టు సమయంలో నా ఆరోగ్యం సరిగా లేని కారణంగా వెళ్లలేదు. భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరగునున్న టీ ట్వంటీలు చూసేందుకు ఖచ్చితంగా వెళ్తానని గంగూలీ ప్రకటించారు.

కాగా, మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. మూడు వన్డేలు వరుసగా మార్చి 23, 26, 28 తేదీల్లో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతాయి.

Tags:    

Similar News