ధోని వల్లే ఆ సెంచరీ కోల్పోయా : గంభీర్

చాలా మంది ఆ మ్యాచ్ లో ఆ మూడు పరుగులు ఎందుకు చేయలేదని అడిగేవారని, ఆ సమయంలో నాకు జట్టును విజయతీరాలకి

Update: 2019-11-18 17:16 GMT
dhoni and gambheer

2011వ సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీంఇండియా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆ మ్యాచ్ లో శ్రీలంకతో పోరాడిన భారత జట్టు విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత భారత్ కు ప్రపంచ కప్ ని అందించింది. ఆ మ్యాచ్ లో గంభీర్, ధోని అద్భుతమైన ఆటను కనబరిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. అయితే ఆ మ్యాచ్ లో గంభీర్ 97 పరుగులు చేసి శ్రీలంక బౌలర్ పెరీరా బౌలింగ్ లో ముందుకు వచ్చి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత చాలా మంది ఆ మ్యాచ్ లో ఆ మూడు పరుగులు ఎందుకు చేయలేదని అడిగేవారని, ఆ సమయంలో నాకు జట్టును విజయతీరాలకి చేర్చాలనే లక్ష్యం మాత్రమే ఉండదని, నేను 97 పరుగులు వద్ద ఉన్నానని, మరో మూడు పరుగులు చేస్తే సెంచరీ చేస్తానని నాకు ధోని చెప్పే వరకు తెలియదని చెప్పాడు గంభీర్.. ఆ మూడు పరుగుల కోసం ముందుకు వచ్చి ఆడి అవుట్ అయ్యానని, ఆ మూడు పరుగులు నన్ను ఇంకా వేధిస్తున్నాయని అన్నాడు గంభీర్.. ఆ మ్యాచ్ లో ధోని 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

Tags:    

Similar News