Neeraj Chopra Net Worth: రేంజ్ రోవర్ నుంచి ముస్టాంగ్ జీటీ వరకు.. నీరజ్ చోప్రా ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Neeraj Chopra Bike Collection: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత నీరజ్ చోప్రా జీవనశైలిలో విపరీతమైన మార్పు వచ్చింది. నేడు అతని గ్యారేజీలో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇది కాకుండా, అతను చాలా ఖరీదైన బ్రాండ్ ఒప్పందాలను కూడా కలిగి ఉన్నాడు.
Neeraj Chopra Car Collection: భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత్ పేరును ప్రపంచ వ్యాప్తంగాచాటిచెప్పాడు. టోర్నీలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో దేశపు 'గోల్డెన్ బాయ్'గా పిలుచుకునే నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలోనే 88.17 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. ఫైనల్‌లో మొత్తం ఆరు రౌండ్లు జరిగాయి.
అనేక ఖరీదైన బ్రాండ్ డీల్స్..
అంతకుముందు, పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో నీరజ్ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత అతని జీవనశైలిలో విపరీతమైన మార్పు వచ్చింది. నేడు అతని గ్యారేజీలో చాలా ఖరీదైన కార్లు చేరాయి. ఇది కాకుండా, అతను చాలా ఖరీదైన బ్రాండ్ ఒప్పందాలను కూడా కలిగి ఉన్నాడు.
నీరజ్ చోప్రా చెంత అత్యంత ఖరీదైన వస్తువులు..
రేంజ్ రోవర్ స్పోర్ట్..
నీరజ్ చోప్రా ఇటీవల రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను కొనుగోలు చేశాడు. ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ.1.98 కోట్ల నుంచి రూ.2.22 కోట్ల మధ్య ఉంది. ఈ కారు పనితీరు అద్భుతంగా ఉంది. ఇది కాకుండా, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా వద్ద లగ్జరీ స్పోర్ట్స్ కార్ ఫోర్డ్ ముస్టాంగ్ జీటీ కూడా ఉంది. దీని ధర రూ. 93 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉంటుంది.
పానిపట్‌లోని విలాసవంతమైన ఇల్లు..
నీరజ్ చోప్రా మూడు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు హర్యానాలోని పానిపట్‌లో ఉంది. ఇది అతని ఖరీదైన ఆస్తిలో ఒకటి. స్వదేశంలో, అతను ఇప్పటివరకు తన పతకాలు, విజయాలన్నింటినీ ఇందులోనే ఉన్నాయి. నీరజ్ ద్విచక్ర వాహనాల సేకరణలో అత్యంత ఖరీదైన బైక్ హార్లీ డేవిడ్‌సన్ 1200 రోడ్‌స్టర్. ఇది ప్రీమియం క్రూయిజర్ బైక్. దీని ధర దాదాపు రూ.11 లక్షలు.
ఖరీదైన బ్రాండ్ డీల్..
నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తర్వాత కోటి రూపాయల విలువైన బ్రాండ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ బ్రాండ్ డీల్స్ ద్వారా అతని ప్రారంభ ఆదాయం రూ. 2.5 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ఈ ఒప్పందాల తర్వాత, అతను ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీకి వరుసలో నిలిచాడు. మీడియా కథనాల ప్రకారం, నీరల్ చోప్రా తన ఖరీదైన కార్లు, బైక్‌లు, ఆస్తుల గురించి మాట్లాడితే అతని నికర విలువ దాదాపు రూ.40 కోట్లుగా ఉంది.