IPL 2025: బీసీసీఐకి బిగ్ షాక్.. గొంతెమ్మ కోరికలు డిమాండ్ చేస్తున్న ఫ్రాంచైజీలు..

IPL 2025: ఐదేళ్లకోసారి మెగా వేలం నిర్వహించాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐని డిమాండ్ చేశాయి.

Update: 2024-07-27 13:30 GMT

IPL 2025: బీసీసీఐకి బిగ్ షాక్.. గొంతెమ్మ కోరికలు డిమాండ్ చేస్తున్న ఫ్రాంచైజీలు..

IPL 2025: ఐదేళ్లకోసారి మెగా వేలం నిర్వహించాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐని డిమాండ్ చేశాయి. ఇప్పటి వరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మెగా వేలం జరుగుతుంది. మెగా వేలంపై బోర్డు బుధవారం ఫీడ్‌బ్యాక్ సెషన్‌ను నిర్వహించింది. మొత్తం 10 ఫ్రాంచైజీల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఫ్రాంచైజీ 4 నుంచి 6 లేదా 8 రైట్ టు మ్యాచ్ కార్డ్‌ల ద్వారా ఆటగాళ్లను అంటిపెట్టుకోవాలి డిమాండ్ చేశాయి.

3 సంవత్సరాలకు బదులుగా 5 సంవత్సరాలకు మెగా వేలం నిర్వహించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఫ్రాంచైజీకి చెందిన సీనియర్ అధికారి క్రిక్ఇన్ఫోతో తెలిపారు. ఇది ఫ్రాంచైజీకి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను సిద్ధం చేయడానికి తగినంత సమయం ఇస్తుందంటూ పేర్కొన్నారు.

ఫ్రాంచైజీల 3 కీలక డిమాండ్లు..

ఐపీఎల్‌లో ప్రతి మూడు సంవత్సరాలకు మెగా వేలం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫ్రాంచైజీ 2 సంవత్సరాల పొడిగింపును కోరాయి.

చాలా జట్లు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేయాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు.

8 రైట్ టు మ్యాచ్ (RTM) కార్డులు ఇవ్వాలి. ప్రస్తుతం 3 రైట్ టు మ్యాచ్ కార్డులు ఇచ్చారు.

ఆటగాళ్ళ ప్రదర్శనను బట్టి వారి వేలం ధరను పెంచడం లేదా తగ్గించవచ్చు.

ఆటగాళ్ల జీతాలపై కూడా..

ఫ్రాంచైజీ అధికారి నుంచి మరొక సూచన జీతాలకు సంబంధించింది. దీని ప్రకారం, రెండు మెగా వేలం మధ్య ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వారి జీతాలను నేరుగా పెంచే లేదా తగ్గించే హక్కు ఫ్రాంచైజీలకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇది తమ కీలక ఆటగాళ్లను నిలబెట్టుకోవడానికి జట్లకు అవకాశం ఇస్తుంది. అలాగే, ఇంతకు ముందు బేస్ ధర లేదా తక్కువ మొత్తానికి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు రింకూ సింగ్‌ను కోల్‌కతా రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది.

కెప్టెన్‌ని కొనసాగించాలని డిమాండ్..

కీలక ఆటగాడిని లేదా కెప్టెన్‌ని రిటైన్ చేసుకోవడానికి జట్లను అనుమతించాలి. ఇది కాకుండా, ఇతర ఆటగాళ్లను రైట్ టు మ్యాచ్‌గా చేర్చడానికి అనుమతించాల్సి ఉంటుంది. 2017 మెగా వేలంలో రైట్ టు మ్యాచ్ ఉపయోగించారు. రిటెన్షన్, RTM కలపడం ద్వారా జట్లు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకోవడానికి వీలుంటుంది.

ఆటగాళ్ల ప్రదర్శన..

ఈసారి ఐపీఎల్ 2024లో ఫ్రాంచైజీల టెన్షన్‌ను పెంచింది. ఇప్పుడు మ్యాచ్ విన్నర్లుగా మారిన, తక్కువ ధరలకు కొనుగోలు చేసినన చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి ఆ ఆటగాళ్ల కోసం భారీ మొత్తం చెల్లించేందుకు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి ఆటగాళ్లను తమ ర్యాంకులను కాపాడుకోవడం జట్లకు సవాలుగా మారనుంది. మెగా వేలంలో ఈ ఆటగాళ్లకు గట్టి పోటీ ఉండవచ్చు.

Tags:    

Similar News