Ian Bishop about Sachin Tendulkar : సచిన్ కి బౌలింగ్ చేయడం చాలా కష్టం!
Ian Bishop about Sachin Tendulkar : క్రికెట్ ఒక మతం అయితే సచిన్ ఓ దేవుడు అని భావిస్తారు క్రికెట్ అభిమానులు...రెండు దశాబ్దాలకుపైగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సచిన్
Ian Bishop about Sachin Tendulkar : క్రికెట్ ఒక మతం అయితే సచిన్ ఓ దేవుడు అని భావిస్తారు క్రికెట్ అభిమానులు...రెండు దశాబ్దాలకుపైగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సచిన్.. అయితే సచిన్ కి బౌలింగ్ చేయడం కష్టమేనని అంటూ తాజాగా వెస్టిండీస్ మాజీ పేసర్, ప్రస్తుత వాఖ్యత ఇయాన్ బిషప్ అన్నాడు. తాజాగా 'క్రికెట్ కనెక్టెడ్' కార్యక్రమంలో మాట్లాడిన ఈ మాజీ ఆటగాడు సచిన్ తో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. 90ల్లో బిషప్ ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేశాడు.
"నా కెరీర్లో నేను బౌలింగ్ చేసిన చాలా కష్టతరమైన బ్యాట్స్ మెన్ లలో సచిన్ టెండూల్కర్ ఒకడు.. అతనెప్పుడూ స్ట్రైట్‌డ్రైవ్‌లు ఆడతాడు. తన టెక్నిక్‌తో స్ట్రైట్‌డ్రైవ్‌లు ఆడే సామర్థ్యంతో బంతిని బౌలర్ వెనక్కి పంపిస్తాడు" అని ఇయాన్ బిషప్ అన్నాడు. మొత్తం తొమ్మది మ్యాచ్ లలో సచిన్, బిషప్ తలపడ్డారు. ఇందులో నాలుగు టెస్టులు కాగా ఐదు వన్డేలు ఉన్నాయి. మొత్తం సచిన్ ని బిషప్ మూడు సార్లు అవుట్ చేయగా ఇందులో సచిన్ రెండు సార్లు సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలోనే కావడం విశేషం..
ఇక టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్ లో చాలా రికార్డులు సృష్టించి రిటైర్ అయ్యాడు. మొత్తం 463 వన్డేలు ఆడినా సచిన్ మొత్తం 18426 పరుగులు చేశాడు. ఇక 200 టెస్టులలో 15921 పరుగులు చేశాడు. ఇక తన అంతర్జాతీయ కెరీర్ లో 100 సెంచరీలు సాధించిన ఏకైక వ్యక్తిగా సచిన్ నిలిచాడు. ఇందులో టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు ఉన్నాయి.