Ajith Agarkar about Dhoni and Kohli: ధోనీ, కోహ్లిపై ఆసక్తికర వ్యాక్యలు చేసిన టీంఇండియా మాజీ క్రికెటర్
Ajith Agarkar about Dhoni and Kohli: టీంఇండియా కెప్టెన్ గా ధోనీ తనదైన ముద్ర వేయగా, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి కుడా దూకుడుగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.
Ajith Agarkar about Dhoni and Kohli: టీంఇండియా కెప్టెన్ గా ధోనీ తనదైన ముద్ర వేయగా, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి కుడా దూకుడుగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ధోనీ, కోహ్లి కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాక్యలు చేసాడు. 'జట్టును నడిపించడంలో ఇద్దరిదీ భిన్నమైన శైలి. ధోనీ అతిగా స్పిన్నర్ లపై ఆధారపడితే, కోహ్లి ఫాస్ట్ బౌలర్లపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాడు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఇదే' అని అగార్కర్ తెలిపాడు..
ఇక అజిత్ అగార్కర్ గురించి ప్రస్తావిస్తే.. 1998లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అగార్కర్ 26 టెస్ట్లు, 191 వన్డే లు, 4 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వీటిలో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు కుడా ఉన్నాయి. ఫస్ట్ క్లాసు క్రికెట్ లో అగార్కర్ అత్యుత్తమ స్కోర్ 109 నాట్ అవుట్ గా నిలిచాడు. చివరిగా 2007లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతే కాదు 16 అక్టోబర్ 2013 న, అగర్కర్ 2013-14 రంజీ సీజన్ ప్రారంభానికి ముందే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ లనుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.