Gary Kirsten: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ గా గ్యారీ కిర్ స్టన్..!!

* పాకిస్తాన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్న గ్యారీ కిర్ స్టన్

Update: 2021-10-28 11:27 GMT

Gary Kirsten: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు త్వరలో కొత్త కోచ్ రానున్నాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లో వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న పాక్ జట్టుకు ప్రస్తుతం హెడ్ కోచ్ గా మిస్బా ఉల్ హక్ బాధ్యత వహిస్తుండగా వకార్ యూనిస్ బౌలింగ్ కోచ్ గా, ఫీల్డింగ్ కోచ్ గా గ్రాంట్ బ్రాడ్బమ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తరువాత దక్షిణాఫ్రికాకి మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టన్ పాకిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే గ్యారీ కిర్ స్టన్, సైమన్ కటిచ్, పీటర్ మూర్స్ పాకిస్తాన్ కోచ్ రేసులో ఉండగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా మాత్రం గ్యారీ కిర్ స్టన్ పైనే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక టీమిండియా 2011 లో వన్డే ప్రపంచకప్ గెలిచిన సమయంలో గ్యారీ కిర్ స్టన్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం గ్రూప్ 2 లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లపై ఘనవిజయం సాధించి పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్ లో బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది.

Tags:    

Similar News