Rahul Dravid: ఆ బోనస్ నాకొద్దు.. నా స్టాప్‌కి ఎంతిస్తారో అంతే ఇవ్వండి.. రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం..!

T20 World Cup Prize Money: టీ20 ప్రపంచకప్ విజేత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.125 కోట్ల రివార్డును అందజేసింది.

Update: 2024-07-10 05:37 GMT

Rahul Dravid: ఆ బోనస్ నాకొద్దు.. నా స్టాప్‌కి ఎంతిస్తారో అంతే ఇవ్వండి.. రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం..!

Rahul Dravid Refuses Extra Bonus: టీ20 ప్రపంచకప్ విజేత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.125 కోట్ల రివార్డును అందజేసింది. ఈ ప్రైజ్ మనీని ఆటగాళ్లు, 42 మంది కోచింగ్ సిబ్బందికి పంచాల్సి ఉంది. రూ.125 కోట్లలో జట్టులోని మొత్తం 15 మంది సభ్యులు, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు అందాల్సి ఉంది. మిగిలిన కోచింగ్‌ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.2.5 కోట్ల చొప్పున వాటా దక్కనుంది. టి20 ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్‌తో పాటు విక్రమ్ రాథోడ్, పరాస్ మహంబ్రే, టి దిలీప్‌లను సహాయక సిబ్బందిలో చేర్చారు.

హిందుస్థాన్ టైమ్స్ కథనం మేరకు రాహుల్ ద్రవిడ్ అదనపు బోనస్ తీసుకోవడానికి నిరాకరించారు. ద్రవిడ్ తన మిగిలిన కోచింగ్ స్టాఫ్‌నకు ఇచ్చే ప్రైజ్ మనీనే తీసుకునేందుకు అంగీకరించారు. అంటే, రూ.5 కోట్లలో (2.5 కోట్లు) సగాన్ని వదులుకోవడానికి ద్రవిడ్ అంగీకరించారు. కోచింగ్ స్టాఫ్‌లోని ఇతర సభ్యుల మాదిరిగానే ద్రవిడ్ కూడా రూ.2.5 కోట్లు తీసుకుంటారు.

జూన్ 29న దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది నాలుగో విజయం. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలి క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007, 2011లో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. టీ20 ప్రపంచకప్ ను 2007 లో భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత తాజాగా కప్ ను కైవసం చేసుకుంది.

Tags:    

Similar News