Ishan Kishan: ఇషాన్ కిషన్ పై మాజీల ప్రశంసలు - ధోనితో పోల్చిన సెహ్వాగ్
Ishan Kishan: తొలి మ్యాచ్‌లోనే డేరింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్‌పై మాజీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Ishan Kishan: తొలి మ్యాచ్‌లోనే డేరింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 28 బంతుల్లోనే హాప్ సెంచరీ పూర్తి చేసిన కిషన్ ప్రతిభను ఆకాశానికెత్తుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మాజీ దిగ్గజాలు. ఇక సెహ్వాగ్ ఏకంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో పోల్చాడు. ''జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువ కీపర్, బ్యాట్స్‌మెన్ తన సామర్థ్యమేమిటో చూపించాడు. గతంలో కూడా ఇలాగే జరిగింది. ఏమాత్రం భయం లేకుండా డేరింగ్ బ్యాటింగ్ తో ఇషాన్ కిషన్ ఆకట్టుకున్నాడు'' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ దేశవాళి క్రికెట్ లో జార్జండ్ టీమ్ కు ఆడుతున్నాడు. అలా ధోనితో కిషన్ ను సెహ్వాగ్ పోల్చాడని అనుకుంటున్నారు నెటిజన్లు.
''తొలి మ్యాచ్‌లోనే ఏమాత్రం తడబడకుండా యంగ్ బాయ్ కిషన్ ఆడిన తీరు అద్భుతం. ఐపీఎల్‌లో ఆడిన అనుభవంతో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. అలాగే కెప్టెన్ కోహ్లి కూడా తనదైన క్లాసిక్ ఆటతో ఫాంలోకి వచ్చాడు'' అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. అలాగే టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, ఆర్పీ సింగ్ తదితరులు కిషన్ ఆటను అభినందిస్తూ ట్వీట్లు చేశారు.
కాగా కెప్టెన్ విరాట్ కోహ్లి(73), ఇషాన్ కిషన్ ( 56) సూపర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా రెండో టీ20లో ఇంగ్లండ్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.