IPL 2020: శతకం తో చెలరేగిన కెఎల్ రాహుల్.. బెంగళూరు ముందు207 పరుగుల భారీ లక్ష్యం!

కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఇదీ.. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ చెలరేగిపోయాడు.

Update: 2020-09-24 16:11 GMT

 కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఇదీ.. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. ఐపీఎల్ 13 సీజన్లలో ఏ కెప్టెన్ సాధించని ఘనత సాధించాడు. 69 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ ఏ కెప్టెన్ ఇన్ని పరుగులు ఐపీఎల్ లో చేయలేదు దీంతో పంజాబ్ జట్టు బెంగళూరు 207 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని అందించింది. ఒక్కడే ఒక్కడు.. జట్టును ముందుంచి నడిపించాడు. మొదట్లో అతనికి సహకారం అందించిన మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన తరువాత మిగిలిన వారి నుంచి అంత సహకారం లాభించకపోయినా ఒక్కడే జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిలబెట్టాడు.

పంజాబ్ బ్యాటింగ్ సాగిందిలా..

* ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తొలి ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. రాహుల్‌ ఒక సింగిల్‌ ఒక బౌండరీ బాదాడు.

* డేల్‌స్టెయిన్‌ వేసిన రెండో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ మరో రెండు ఫోర్లు బాదాడు. 2 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌ 17/0

* ఉమేశ్‌ యాదవ్‌ వేసిన మూడో ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్‌ రెండో ఫోర్లు బాదాడు. 3 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌ 26/0

* పంజాబ్‌ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ శుభారంభం చేశారు. 5 ఓవర్లకు వీరిద్దరూ 41 పరుగులు చేశారు.

* ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్‌ 50 పరుగులు చేసింది.

* చాహల్‌ వేసిన ఏడో ఓవర్‌ చివరి బంతికి మయాంక్‌ అగర్వాల్‌(26) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో బెంగళూరుకు తొలి వికెట్‌ దక్కింది. 7 ఓవర్లకు పంజాబ్‌ 57/1తో నిలిచింది.

* ఉమేశ్‌ యాదవ్‌ వేసిన పదో ఓవర్లో రాహుల్‌ ధాటిగా ఆడాడు. ఓ సిక్సర్‌, బౌండరీతో చెలరేగిపోయాడు. పదో ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు పంజాబ్‌ స్కోరు 90/1

* రాహుల్‌ అర్ధసెంచరీ : రాహుల్‌ 36 బంతుల్లో 50 పరుగులు సాధించాడు.

* నవదీప్‌ సైనీ వేసిన 13వ ఓవర్లో రాహుల్‌ రెండు బౌండరీలు బాదాడు. రాహుల్, పూరన్‌ల భాగస్వామ్యం 50 పరుగులు దాటింది.13 ఓవర్లకు పంజాబ్‌ స్కోరు 114/1.

* శివమ్‌ దూబె వేసిన 14వ ఓవర్‌ తొలి బంతికి నికోలస్‌ పూరన్‌(17) ఔటయ్యాడు. అతడు ఫోర్‌ కొట్టే క్రమంలో డివిలియర్స్‌ చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్‌ 114 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

* 16 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్‌ 132/3తో నిలిచింది. శివమ్‌దూబె వేసిన ఈ ఓవర్‌లో మాక్స్‌వెల్‌(5) ఔటయ్యాడు.

* డేల్‌స్టెయిన్‌ వేసిన 19వ ఓవర్‌లో రాహుల్‌ చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు సంధించడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. దీంతో 19 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 183/3కి చేరింది.

* పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(132) శతకంతో చెలరేగాడు. అతడికి మయాంక్‌ అగర్వాల్‌(26), నికోలస్‌ పూరన్‌(17), కరన్‌ నాయర్‌(15) సహకరించారు.



Tags:    

Similar News