England vs West Indies 2nd Test: రెండో టెస్టు కోసం కసరత్తులు చేస్తున్న ఇంగ్లాండ్.. టీంలోకి జో రూట్ ఎంట్రీ!
England vs West Indies 2nd Test: కరోనా తర్వాత దాదాపుగా 118 రోజుల అనంతరం మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు మొదలయ్యాయి.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ని ఈసీబీ బోర్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది
England vs West Indies 2nd Test: కరోనా తర్వాత దాదాపుగా 118 రోజుల అనంతరం మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు మొదలయ్యాయి.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ని ఈసీబీ బోర్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.. అయితే మొదటి టెస్టులో ఘోర పరాజయం పాలైన ఇంగ్లీష్ జట్టు.. రెండో టెస్టులో విజయం సాధించాలనే కసితో ఉంది..అందులో భాగంగానే ఇంగ్లాండ్ జట్టులోకి కెప్టెన్ జో రూట్ ఎంట్రీ ఇచ్చాడు. తన భార్య ప్రసవ సమయంలో ఆమె వద్దే ఉండాలని నిర్ణయించుకున్న జో రూట్ సౌథాంప్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టుకి దూరమయ్యాడు.
దీనితో ఈ మ్యాచ్ కి స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరించిన బెన్‌స్టోక్స్ అన్ని పేలవమైన నిర్ణయాలు తీసుకొని జట్టు ఓటమికి ప్రత్యేక్ష కారణం అయ్యాడు. దీనితో జట్టు అనూహ్యగా 4 వికెట్ల తేడాతో విండీస్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. టెస్టు ఆరంభానికి ముందు వర్షం పడే సూచనలు కనిపించినప్పటికి బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత జట్టు ఎంపికలో ఫెయిల్ అయ్యాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌పై వేటు వేయడంతో ఇంగ్లీష్ టీం కి పెద్ద మైనస్ గా మారిపోయింది. ఆ తర్వాత ఫీల్డింగ్ కూర్పులోనూ బెన్‌స్టోక్స్ పూర్తిగా విఫలం అయ్యాడు. దీనితో విండీస్ ఆ జట్టు ఇంగ్లాండ్ పైన అన్ని విభాగాల్లో పై చేయి సాధించి విజయాన్ని అందుకుంది..
రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇది పునరావృతం కాకుండా ఉండేందుకు ఇంగ్లాండ్ జట్టు కసరత్తులు మొదలు పెట్టింది.. అందులో భాగంగానే కెప్టెన్ జో రూట్ ని బరిలోకి దింపింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఇక మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్ ఓడిపోతే కనుక మూడు టెస్టుల సిరీస్ ఇంగ్లాండ్‌కి చేజారనుంది. అటు మొదటి టెస్టు విజయంతో జోరుమీదున్న వెస్టిండీస్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.