England vs Pakistan: ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన పాక్ బౌలర్
England vs Pakistan: కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసీసీ కొత్తగా రూల్స్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ కరోనా నేపథ్యంలో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ పాకిస్థాన్ ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
England vs Pakistan: కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసీసీ కొత్తగా రూల్స్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ కరోనా నేపథ్యంలో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ పాకిస్థాన్ ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ఐసీసీ కొత్త రూల్స్ బ్రేక్ చేశాడు. బౌలింగ్ చేసే సమయంలో అమీర్ పదేపదే బంతిపై ఉమ్మి రుద్దాడు. బంతి వేసే ముందు అమీర్ ఉమ్మి రుద్దడం వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఈ విషయం కనిపించినప్పటికీ ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు. వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఎవరైనా ఉమ్మి రాస్తే.. వెంటనే అంపైర్లు టిష్యూతో దాన్ని శుభ్రం చేసి మ్యాచ్‌ని కొనసాగించాలి. కానీ అవేమీ పట్టించుకోలేదు అంపైర్.
అలవాటులో పొరపాటుగా ఏ బౌలరైనా బంతిపై ఉమ్మి రుద్దితే.. తొలుత హెచ్చరించాలని అంపైర్లకి ఐసీసీ సూచించింది. ఒక ఇన్నింగ్స్‌లో రెండు సార్లుకి మించి అలా రూల్స్‌ని బ్రేక్ చేస్తే.. ఆ జట్టుకి 5 పరుగులు జరిమానా విధించవచ్చు. కానీ అంపైరు విషయాని పట్టించుకోకపోవడంతో పాక్ ఆ పెనాల్టీ నుంచి తప్పించుకుంది.
తాజాగా ఐసీసీ ప్రవేశపెట్టిన రూల్స్ ప్రకారం.. బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దకూడదు. మైదానంలో ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోకూడదు, భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిందే. అలానే వికెట్ పడిన సమయంలో హైఫైని కూడా నిషేధించింది. ఆటగాళ్లకి పాత అలవాట్లని దూరం చేసేందుకు ప్రాక్టీస్ సెషన్, వార్మప్ మ్యాచ్‌లను కూడా నిర్వహించారు.