భారత్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కుంటున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు

Update: 2019-06-30 10:20 GMT

ఇంగ్లాండ్ ఓపెనర్లు పట్టుదలగా బ్యాటింగ్ చేస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టడానికి కోహ్లీ చాహల్ ను రంగం లోకి దింపినా ప్రయోజనం కనిపించలేదు. నిప్పుల్లా వస్తున్న బుమ్రా బంతుల్ని ఓపిగ్గా కాచుకుంటూ, రెండో ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్న చాహల్, షమీల బౌలింగ్ లో దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెట్టిస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రాయ్ 20 పరుగులతోనూ, బెయిర్‌స్టో 24 పరుగులతోనూ ఉన్నారు.  

Tags:    

Similar News