India vs England 1st T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
India vs England T20: టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
India vs England T20: నేటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు టీ 20 లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరగనున్నాయి.
టాస్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. పిచ్ గడ్డితో కవర్ చేసి మంచి వికెట్ లా ఉంటుందనుకుంటున్నాను. చీకటి పెరుగుతుండడంతో మంచు పడుతుంది. ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరిగా సాగనుంది. భారత్ లోనే పొట్టి ప్రపంచకప్ జరగనుండడంతో మాకు ఈ మ్యాచ్ లు కలిసి వస్తాయనుకుంటున్నా. మంచి టీంతోనే బరిలోకి దిగుతున్నాం అని అన్నారు.
అనంతరం టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, టాస్ మేం గెలిచినా బౌలింగే తీసుకునే వాళ్లం. సెంకండ్ హాఫ్ లో బౌలింగ్ కి కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. టీ20 ప్రపంచ కప్ కు ఈ సిరీస్ చాలా ముఖ్యం. అందుకే రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చామన్నాడు. దీంతో రాహుల్, శిఖర్ ధావన్ ఓపెనింగ్ జోడీగా రానున్నారు.
టెస్ట్ సిరీస్ విజయంతో దూకుడుమీందుంది టీం ఇండియా. టీ20ల్లో నెంబర్‌వన్ ర్యాకింగ్‌లో ఉన్న ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతోంది. టీ20 సిరీస్‌ను గెలిచి టీ 20 ప్రపంచ కప్‌లో ఆత్మవిశ్వాసంతో అడగుపెట్టాలని ఇండియా టీం ఆలోచిస్తుంటే.. టెస్టుల్లో ఓడినందుకు బదులుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది ఇంగ్లిష్ జట్టు.
టీంలు
భారత్ జట్టు: కోహ్లి (కెప్టెన్), రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్, చహల్.
ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్ (వికెట్ కీపర్), మలన్, బెయిర్‌స్టో, స్టోక్స్, సామ్ కరన్, జొర్డాన్, ఆర్చర్, మార్క్‌వుడ్, రషీద్