Pink Ball Test: పిచ్ ను తప్పుగా అంచనా వేశాం - జోరూట్

Pink Ball Test: 3వ టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల రీజన్‌ను ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ వివరించాడు.

Update: 2021-03-03 10:55 GMT
జోరూట్ (ఫోటో హన్స్ ఇండియా)

Pink Ball Test: అహ్మదాబాద్‌ వేదికగా ఇండియాతో జరిగిన 3వ టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల రీజన్‌ను ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ వివరించాడు. పింక్‌బాల్‌ టెస్టులో తాము పరిస్థితుల్ని తప్పుగా అంచనా వేశామని అంగీకరించాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన రూట్‌ 4వ టెస్టులో యువ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ను తుది జట్టులోకి తీసుకుంటామన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

3వ టెస్టులాగే 4వ టెస్టుకు కూడా పిచ్‌ అలాగే ఉంటే.. డామ్‌ బెస్‌ తుది జాబితాలో కచ్చితంగా ఉంటాడు. అవకాశం వస్తే ఉపయోగించుకుని టాలెంట్ చూపాలని ఆరాట పడుతున్నాడు. గత టెస్టులో నా బౌలింగ్‌ ప్రదర్శన(5/8) చూసి అతడెంతో ఉత్సాహంతో ఉన్నాడు. అతడు నా కన్నా ఎంతో నైపుణ్యం గల స్పిన్నర్‌' అని రూట్‌ తెలపాడు.

ఇక పింక్‌బాల్‌ టెస్టులో మా టీం తుది ఎంపికలో తప్పు జరిగింది. పిచ్‌ను అంచనావేయలేకపోయాం. కానీ, బాల్ ఇలా తిరుగుతుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైన తుది ఆటలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నామని వివరించాడు. ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య రేపటి నుంచి తుది టెస్టు మ్యాచ్ జరగనుంది.

Tags:    

Similar News