Border-Gavaskar Trophy: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ వెనకాల ఇంత చరిత్ర ఉందా.? ఈ పేరు ఎలా వచ్చిందంటే..

Border-Gavaskar Trophy: క్రికెట్ అభిమానులు బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.

Update: 2024-11-19 05:54 GMT

Border-Gavaskar Trophy: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ వెనకాల ఇంత చరిత్ర ఉందా.? ఈ పేరు ఎలా వచ్చిందంటే..

Border-Gavaskar Trophy: క్రికెట్ అభిమానులు బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. టీ20 మ్యాచ్‌ల హవా కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో కూడా టెస్ట్‌ మ్యాచ్‌లకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పేందుకు ఈ ట్రోఫీ ఒక క్లాసికల్‌ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఇక తాజాగా 2024-25 సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్‌-గవస్కార్‌ సిరీస్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు.

నవంబర్ 22 నుంచి పెర్త్‌ వేదికగా జరిగే తొలి టెస్టుతో సిరీస్‌ మొదలుకానుంది. భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఈ సిరీస్‌కు 28 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిరీస్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. నేటి యువతరం కూడా ఈ సిరీస్‌పై మక్కువ పెరగడం విశేషం. ఈ సిరీస్‌ను గెలవడాన్ని ఇరుజట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇంతకీ బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ అసలు ఎలా ప్రారంభమైంది.? దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ట్రోఫీని తొలిసారి 1996లో ప్రారంభించారు. ఈ ఏడాదిలోనే ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ కోసం భారత్‌కు వచ్చింది. ఇరు దేశాల క్రికెట్‌ టీమ్స్‌కు ఎంతో సేవలందించిన దిగ్గజ క్రికెటర్లు.. సునీల్ గావస్కర్, అలెన్ బోర్డర్ గౌరవార్థం ఒక సిరీస్‌ నిర్వహిస్తే బాగుంటుందని భారత్‌, ఆసీస్‌ క్రికెట్‌ బోర్డులు ఆలోచించాయి. అనుకున్న తడవుగా వెంటనే సిరీస్‌ పేరును కూడా ప్రకటించారు.

‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’గా ఈ సిరీస్‌కు పేరు పెట్టారు. తొలి సిరీస్‌లో టీమిండియా విజయం సాధించింది. అలా మొదలైన ఈ సిరీస్‌ ఇప్పటికీ ఒక ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంది. గావస్కర్, అలెన్ బోర్డర్ ఇద్దరూ టెస్టుల్లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసి తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అందుకే వారి గౌరవార్థం ఈ ట్రోఫీకి ఈ పేరు పెట్టారు. ఇప్పటి వరకు 16 సార్లు నిర్వహించగా భారత్‌ 10 సార్లు, ఆస్ట్రేలియా 5 సార్లు విజయం సాధించింది. కాగా ఒకసారి డ్రా అయ్యింది. మరి ఇప్పుడు జరుగనున్న ఈ సిరీస్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 

Tags:    

Similar News