WTC Final: లెజెండరీతో కామెంటరీకి నేను రెడీ: దినేష్ కార్తీక్
WTC Final: జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌తో టీం ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపనున్న సంగతి తెలిసిందే.
WTC Final 2021: జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌తో టీం ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కు లెజెండ్ సునీల్ గవాస్కర్‌తో పాటు కామెంట్రీకి సిద్ధమయ్యానని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు టీమిండియా సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఈ మేరకు ట్విట్టర్‌లో సునీల్ గవాస్కర్‌తో పాటు లంచ్ చేస్తున్న ఫొటో ను అభిమానులతో పంచుకున్నాడు.
దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా నూతన అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ కు కామెంటేటర్‌గా కార్తీక్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న అతను కఠిన క్వారంటైన్ పూర్తి చేశాడు. ఈ టూర్‌కి జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. జట్టులో ఆటగాడిగా లేకున్నా.. కామెంటేటరీ రూపంలో ఈ చారిత్రాత్మక ఫైనల్‌లో భాగమయ్యాడు.
తాజాగా లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌తో దిగిన ఒక సెల్ఫీని తన ట్విటర్‌లో పంచుకున్నాడు. '' లంచ్ డేట్ విత్ లెజెండ్'' అంటూ రాసుకొచ్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, ఇండియాలో ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడిన టెస్టు సిరీస్‌కు కూడా కార్తీక్ కామెంటేటర్‌గా పనిచేశాడు. వర్చువల్ గా కామెంటరీ చేసిన కార్తీక్... తాజాగా సౌతాంప్టన్ వేదికగా మొదలుకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మైదానం నుంచే కామెంటరీ చేయనున్నాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఐపీఎల్ 2021 లో ఆడుతున్న కార్తీక్.. డబ్ల్యూటీసీ పూర్తయ్యాక సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా మొదలుకానున్న ఐపీఎల్ 14వ సీజన్ సెకండాఫ్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నాడు.