Dhyan Chand Khel Ratna : భారత్ లో క్రీడారంగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఖేల్ రత్న అవార్డు ఇస్తారని తెలిసిందే. అయితే.. ఈ ఖేల్ రత్న అవార్డు నిన్నటి దాకా రాజీవ్ ఖేల్ రత్నగాపిలవబడగా.. ఇప్పుడు దాని పేరు ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇలా ఎందుకు మార్చాల్సి వచ్చింది.. దేశంలో ఎంతో మంది క్రీడాకారులు ఉండగా..ధ్యాన్ చంద్ పేరును మాత్రమే ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసుకుంది.. అనేవి ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం. ధ్యాన్ చంద్ గురించి చాలా మందికితెలియని ఓ గొప్ప విషయం ఉంది.
1936 లో జరిగిన ఒలంపిక్స్ హాకీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జర్మనీతో తలపడింది. ఆ ఫైనల్ మ్యాచ్ లో భారత్ 16-1 తేడాతో జర్మనీని మట్టి కరిపించింది. భారత్ తరపున ధ్యాన్ చంద్ 15 గోల్స్ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలో స్టేడియంలో దాదాపుగా 25 వేల మంది ప్రేక్షకులతో పాటు ప్రపంచములోనే గొప్ప నియంత అయిన హిట్లర్ కూడా ఆ మ్యాచ్ ని తిలకించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ధ్యాన్ చంద్ వద్దకి వచ్చిన హిట్లర్ తన సహచరులతో "అతడి హాకీ స్టిక్ విరగ్గొట్టి చూడండి.. అందులో తప్పకుండా ఏదో అయస్కాంతం ఉండి ఉంటుంది లేకపోతే ఇలా ఎలా ఆడతాడు" అని హాకీ స్టిక్ విరగోట్టగా ఎలాంటి అయస్కాంతమూ దొరకలేదు.
దాంతో కంగుతిన్న హిట్లర్ అదేరోజు రాత్రి ధ్యాన్ చంద్ ని తన వద్దకు పిలిపించుకొని హాకీ ఆట కాకుండా నువ్వు ఇంకా ఏమేమి చేస్తావని ధ్యాన్ చంద్ ని అడగగా "నేను ఆర్మీలో సుబేదార్ గా పని చేస్తున్నానని సమాధానం ఇచ్చాడు. అపుడు హిట్లర్ "ధ్యాన్ చంద్, నీ దేశము నీకేమిచ్చింది..? ఈరోజుకు నువ్వు కేవలం సుబేదార్ వి. జర్మనీ హాకీ జట్టు తరపున ఆడితే తక్షణమే నిన్ను ఎయిర్ ఫీల్డ్ మార్షల్ గా నియమిస్తానని చెప్తూతుండగా.. నీదేశం నీకేమిచ్చింది ? అన్న హిట్లర్ మాటలకూ "మన దేశపు ప్రస్తావన రాగానే ధ్యాన్ చంద్ మిస్టర్ హిట్లర్, నన్ను ముందుకు తీసుకుపోవడము నా దేశపు బాధ్యత కాదు కాని నా దేశాన్ని ముందుకు తీసుకుపోవడము నా బాధ్యత అని తమరు ఎన్ని పదవులు ఇచ్చిన, ఎంత డబ్బు ఇచ్చిన నేను నా దేశానికి మాత్రమే ఆడుతాను.
పరాయి దేశాలకోసం ఆడను.." అని తెగేసి చెప్పగానే హిట్లర్ నిర్ఘాంతపోయి తలదించుకున్నాడు. అలాంటి ఆటగాడిని గుర్తిస్తూ నేడు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు పేరు మార్చి "ధ్యాన్ చంద్ ఖేల్ రత్న" అవార్డుగా పేరు పెట్టి భారత ప్రభుత్వం దేశభక్తిని చాటింది.