MS Dhoni: ఆ రెండు కారణాల వల్లే ఓడిపోయాం

* మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను మీడియాకి వివరించిన చెన్నై కెప్టెన్ ధోని

Update: 2021-10-05 08:30 GMT

ధోని (ఫోటో: ఐపీఎల్ )

MS Dhoni: ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించి పాయింట్స్ పట్టికలో మొదటి స్థానానికి చేరింది. ఇక చెన్నై బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం.. ఇక మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగిన అంబటి రాయుడు అర్ధసెంచరీ మినహా ధోని కూడా ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ లో రాణించకపోవడంతో చెన్నై పరాజయాన్ని మూటకట్టుకుంది.

మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోని తమ ఓటమికి గల కారణాలను వివరించాడు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విఫలమవడంతో పాటు మిడిల్ ఓవర్లలో అనుకున్న పరుగులను సాధించలేకపోయామని.., 150 పరుగులను సాధించి ఉంటే తమ జట్టుకు గెలుపు అవకాశాలు ఉండేవని తెలిపాడు.

పిచ్ రెండు విధాలుగా మారడంతో బ్యాటింగ్ కి అంతగా అనుకూలించలేదని.., కాని ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో షికార్ ధావన్ 4వ ఓవర్ లో దీపక్ చహార్ బౌలింగ్ లో సాధించిన 20 పరుగులు ఢిల్లీ విజయానికి కీలకంగా మారిందని.., అదే మా ఓటమికి కారణమని ధోని అన్నారు.

సోషల్ మీడియాలో మాత్రం ఒక వైపు అంబటి రాయుడు అద్భుత బ్యాటింగ్ తో బౌండరీలతో అదరగొడుతుంటే క్రీజులో ఉన్న ధోని మాత్రం ఒక్క బౌండరీ కూడా సాధించలేక 27 బంతుల్లో 18 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో చివరి ఓవర్లో అవుట్ అయి పెవిలియన్ చేరడంపై అటు నెటిజన్లు ధోని బ్యాటింగ్ ప్రదర్శనపై మండిపడుతున్నారు.

Tags:    

Similar News