హర్భజన్‌ను మాములుగా ఆడుకోట్లేదు ధోని ఫ్యాన్స్ ! ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయలేను అన్నప్పుడు కూడా అంత హర్ట్ కాలేదు మరి ఇప్పుడెందుకు భజ్జీని టార్గెట్ చేశారు ? సెన్స్ లేదు.. చీప్ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అనేంత స్ట్రాంగ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు ?
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓ వైడ్ బాల్ వ్యవహారం కాంట్రవర్సీ అయిందిప్పుడు ! బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని వైడ్‌గా ప్రకటిద్దామని ఎంపైర్ చేతులు చాస్తుండగా వికెట్ల వెనక నుంచి ధోని కళ్లు పెద్దవి చేసుకొని చూశాడు. దీంతో మళ్లీ చేతులు కిందకు దించాడు ఎంపైర్. ఐతే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ! ఎంపైర్‌ను ధోని భయపెట్టాడని కొందరు ఇప్పుడా బాల్ వైడ్ ఇస్తే గెలిచేవారా అంటూ సెటైర్లు వేస్తూ ఇంకొందరు అలా ఎలా ఉంటుంది ఆటంటే ఆటే కదా అని ఇంకొందరు ఎవరికి వారు కామెంట్స్ పెడుతున్నారు.
ఐతే వీడియోను షేర్ చేస్తూ హర్భజన్ కొన్ని ఫన్నీ ఇమేజ్‌లు పెట్టాడు. అది కాస్త ఇప్పుడు పెద్ద దుమారానికి కారణం అవుతోంది. సీఎస్కే ఫ్యాన్స్ భజ్జీని ఓ ఆటాడేసుకుంటున్నారు. అతను పాములాంటోడని హర్భజన్ సింగ్ కాదు హర్భజన్ స్నేక్ సింగ్ అని జట్టు నుంచి పూర్తిగా తొలిగించడమే మంచిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే అతన్ని నమ్మి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ పెద్ద తప్పు చేసిందని ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు. తన స్వార్థం చూసుకొని ఆటకు, జట్టుకు దూరమైన హర్భజన్‌కు మాట్లాడే హక్కే లేదని మరికొందరు ఫైర్ అవుతున్నారు.
సొంత జట్టుపై, టీమ్ కెప్టెన్‌పై కామెంట్స్ చేయడం కరెక్టేనా ఇది చీప్ స్పోర్ట్స్‌మన్‌షిప్ అంటూ హర్భజన్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. అయినా సొంత జట్టు సభ్యున్నే కొట్టిన చరిత్ర ఉన్న నువ్ కూడా మాట్లాడుతున్నావా అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. ఐతే ఈ వైడ్‌బాల్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైడ్ విషయంలో ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్‌కు రివ్యూ తీసుకునే అవకాశం కల్పించాలని అన్నాడు.