DC vs CSK: ఐపీఎల్-17లో బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
DC vs CSK: చెన్నైపై 20 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ
DC vs CSK: ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకున్న ఆ జట్టు విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచింది. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో వార్నర్ 52 పరుగులు, పంత్ 51 , పృథ్వీ షా 43 రాణించారు.
192 పరుగుల భారీ ఛేదనకు దిగిన చెన్నైకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ లను ఖలీద్ అహ్మద్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దీంతో చెన్నై 7 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అజింక్యా రహానే, డారిల్ మిచెల్ జోడి ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని అక్సర్ పటేల్ విడగొట్టాడు. చివరలో ధోని, జడేజా కాసేపు పోరాడారు.