కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..
Commonwealth Games 2022: జాబితాలో 4వ స్థానంలోకి దూసుకెళ్లిన భారత్
Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలు 2022ను భారత్ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆటల చివరి రోజు భారత షట్లర్లు అదరగొట్టారు. 3 బంగారు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు గోల్డ్, సాతియాన్ జ్ఞానేశ్వరన్‌కు కాంస్యం రాగా పురుషుల హాకీ జట్టు రజతం సాధించింది. మొత్తం ఆరుగురు రెజ్లర్లు పసిడి నెగ్గారు. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా పురుషుల 65 కిలోల విభాగంలో రెండోసారి గోల్డ్ మెడల్ సాధించారు. అటు స్టార్ రెజ్లర్ రవికుమార్ దహియా, మహిళల రెజ్లింగ్ 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్, పురుషుల రెజ్లింగ్ 74 కేజీల విభాగంలో నవీన్ కుమార్, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సిందు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.