నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌మెడల్‌ సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం.. స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు..

CWG 2022: నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌మెడల్‌ సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Update: 2022-08-07 14:57 GMT

నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌మెడల్‌ సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం.. స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు..

CWG 2022: నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌మెడల్‌ సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిఖత్‌ జరీన్‌కు స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ ఆమె విజయ పరంపరను అభినందించారు. జరీన్‌ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇవాళ ఒక్కరోజే వివిధ విభాగాల్లో ఏకంగా నాలుగు స్వర్ణాలను సాధించారు. అందులో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ బంగారు పతకాన్ని అందుకుంది.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌ నార్త్ ఐలాండ్ బాక్సర్ మెఖ్నాల్‌ పై సంచలన విజయం సాధించింది. 48, 50 కేజీల విభాగంలో ఆమె ఈ విజయాన్ని అందుకుంది. ఇటు అదే బాక్సింగ్‌ లో నితూ గంగాన్, అమిత్ పంఘాల్ ఫైనల్స్ నెగ్గి పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు. మహిళల బాక్సింగ్ 48 కిలోల విభాగంలో పోటీపడిన నీతూ ఘంఘాస్ ఫైనల్లో ఇంగ్లండ్‎కు చెందిన డెమీ జేడ్ రెస్జాన్ ను 5-0తో మట్టికరిపించింది. అటు పురుషుల బాక్సింగ్ 51 కిలోల విభాగంలో అమిత్ పంఘాల్ ఇంగ్లండ్ బాక్సర్ కైరన్ మెక్ డొనాల్డ్ పై 5-0తో జయభేరి మోగించాడు. అలాగే ట్రిపుల్ జంప్ లో ఎల్డోస్ పాల్ అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణం అందుకున్నాడు. 

Tags:    

Similar News