PBKS vs CSK IPL 2021: పంజాబ్‌ను చిత్తు చేసిన ధోనీ సేన..
PBKS vs CSK IPL 2021: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
PBKS vs CSK IPL 2021: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ సీజన్లో తొలి గెలుపు రుచి చూసింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. ధోనీ సేన టోర్నీలో తొలి విజయాన్ని సొంతం చేసుకుని బోణీ కొట్టింది. పంజాబ్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. చెన్నై బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో పంజాబ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే స్వల్ప స్కోర్ కావడం గమనార్హం.
106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) తక్కువ పరుగులకే వెనుదిరిగినా.. ఫాఫ్‌డూ ప్లెసిన్ 33 పరుగులు, మొయిన్ అలీ 46 పరుగులతో రాణించారు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీపక్ చాహర్ (13/4) అద్భుత ప్రదర్శనతో పంజాబ్ మొదట 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
ఈ విజయంతో చెన్నై.. ఐపీఎల్ 2021 14వ సీజన్లో పాయింట్ల ఖాతా తెరిచింది. ఇక పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ దక్కాయి.తొలి ఓవర్లోనే వికెట్... అయిదు ఓవర్లకే నలుగురు ఔట్! ఏడు ఓవర్లకే పెవిలియన్‌లో సగం జట్టు! ఇదీ టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ సాగిన తీరు! దెబ్బ మీద దెబ్బ కొడుతూ పేసర్ దీపక్ చాహర్ విజృంభించడంతో కింగ్స్ తొలి పది ఓవర్లలో తీవ్రంగా తడబడింది. స్వింగ్, సీమ్‌తో పాటు నకుల్ బంతులు, స్లో బాల్స్ మిళితం చేసి బౌలింగ్ చేసిన చాహర్.. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనీయలేదు. కాగా.. చెన్నై బౌలర్లలో 4 వికెట్లతో రాణించిన దీపక్ చాహర్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.