Champions Trophy 2025 : పాక్ నుంచి భారత్‌కు రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ.. ప్రకటించిన ఐసీసీ

Update: 2024-11-17 10:30 GMT

Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో అప్పటి నుండి ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై సందిగ్ధత నెలకొంది. ఈ టోర్నీ కోసం టీమ్ ఇండియాను భద్రత ఉన్న వేదికకు పంపాలని బీసీసీఐ పేర్కొంది. అయితే పాకిస్తాన్‌కు ఎలాంటి పరిస్థితుల్లోనే పంపేది లేదని బీసీసీఐ ప్రకటించింది. ఈ కారణంగా టోర్నీ చివరి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ICC ట్రోఫీని పాకిస్తాన్ పర్యటన కోసం పంపింది. ఇందులో భాగంగానే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నుంచి భారత్‌కు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ స్వయంగా ప్రకటించింది.

ICC టోర్నమెంట్‌కు ముందు.. ICC ట్రోఫీ పర్యటనను నిర్వహిస్తుంది. దీని కింద ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఎనిమిది దేశాల మధ్య ట్రోఫీని తిప్పడానికి ఒక పర్యటన నిర్వహిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ.. ట్రోఫీ పర్యటన నవంబర్ 16 నుండి ప్రారంభమైంది. ఇది 26 జనవరి 2025 వరకు కొనసాగుతుందని ICC స్పష్టంచేసింది. అన్ని దేశాల్లో పర్యటించిన తర్వాత ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ చేరుకోనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు ఏ దేశానికి వెళ్తుంది?

- పాకిస్తాన్‌లోని వివిధ నగరాల్లో నవంబర్ 16 నుండి 25 వరకు

- ఆఫ్ఘనిస్తాన్‌లో నవంబర్ 26 నుండి 28 వరకు

- బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 10 నుండి 13 వరకు

- దక్షిణాఫ్రికాలో డిసెంబర్ 15 నుండి 22 వరకు

- ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో డిసెంబర్ 25 నుండి జనవరి 5 వరకు

- న్యూజిలాండ్‌లో జనవరి 6 నుండి జనవరి 11 వరకు

- జనవరి 12 నుండి 14 వరకు ఇంగ్లాండ్‌లో

- ఛాంపియన్స్ ట్రోఫీ జనవరి 15 నుండి 26 వరకు భారత పర్యటనలో ఉంటుంది

– జనవరి 27న పాకిస్థాన్‌లో ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News